ఆపరేషన్ గరుడలో లేటెస్ట్ అప్డేట్ : ముద్రగడతో మోత్కుపల్లి భేటీ

Motkupalli Narasimhulu meets Mudragada Padmanabham

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మహానాడు జరుగుతున్న సమయంలో తనకు తెలంగాణా మహానాడుకు అలాగే మెగా మహానాడుకు ఆహ్వానాలు అందలేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై అత్యంత దారుణంగా విమర్శలు చేసారు తెలంగాణ తెలుగుదేశం బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు… అప్పుడే ఏపీలో చంద్రబాబుకు వ్యతిరేకంగా యాత్ర చేస్తానని చెప్పిన ముందుగా టీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేయాలని వ్యాఖ్యానించిన మోత్కుపల్లిని అప్పట్నుంచి పార్టీ దూరం పెడుతూ వచ్చింది. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆహ్వానించడం లేదు. చివరికి మహానాడుకు కూడా పిలవకపోవడంతో రెచ్చిపోయిన ఆయన ఎన్టీఆర్ జయంతి రోజున ఏడ్చేసి చంద్రబాబు పై తిట్ల దండకం మొదలెట్టట్టు. ఆ కారణంగా ఆయనను టీ టీడీపీ అధ్యక్షుడు రమణ పార్టీ నుంచి బహిష్కరించారు. ఇది జరిగి వారం కాక ముందే మద్రగడ పద్మనాభంతో మోత్కుపల్లి సమావేశమయ్యారు.

శుక్రవారం నాడు ఉదయం హైద్రాబాద్ లో కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులుతో చర్చించారు. 30 ఏళ్ళుగా టిడిపికి సేవ చేసిన మోత్కుపల్లి నర్సింహులుకు టిడిపి అన్యాయం చేసిందని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. ఏపీ రాష్ట్రంలో పర్యటించాలని ముద్రగడ పద్మనాభం మోత్కుపల్లిని ఆహ్వానించారు. ఈ మేరకు తాను ఏపీలో పర్యటించేందుకు సిద్దంగా ఉన్నానని మోత్కుపల్లి నరసింహులు కూడ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఆపరేషన్ గరుడలో భాగంగానే ఏపీలో చంద్రబాబునాయుడును ఇరుకున పెట్టేందుకు మోత్కుపల్లి నరసింహులు వ్యూహరచన చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తీసుకొని ఏపీలో బాబును కార్నర్ చేస్తూ మోత్కుపల్లి పర్యటించే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కాపు రిజర్వేష్ల ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తాను చేసిన కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని కూడా దాదాపుగా పక్కన పెట్టేశారు. రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చేలా కేంద్రంలో ఉన్న బీజేపీపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు ఏమీ చేయకుండా… ఆ పార్టీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. మొన్న కన్నా లక్ష్మినారాయణ ఏపీ బీజేపీ అధ్యక్షునిగా ఎంపికయిన రెండు గంటల్లోనే గుంటూరు వెళ్లి మంతనాలు జరిపారు. దానికి శుభాకాంక్షలు తెలిపేందుకే వచానని కవరింగ్ కూడా ఇచ్చారనుకోండి. ఇప్పుడు మోత్కుపల్లి నర్సింహులు చంద్రబాబుతో కొర్రీ రాగానే వెళ్లి పద్మనాభంని కలవడం ఇదంతా ఆపరేషన్ గరుడలో భాగంగానే జరుగుతోందా అనే అనుమానాలని టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి శత్రువుకు శత్రువు మిత్రుడైనట్లు చంద్రబాబును వ్యతిరేకించి ఘాటుగా విమర్శలు చేసే మోత్కుపల్లి లాంటి నేతంలదర్నీ… రాష్ట్రాలకు అతీతంగా ఏకం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందిఅని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు తేలిగ్గా తీసిపారేస్తున్నారు. రాజకీయాల మీద ప్రజలకు ఇప్పుడు పూర్తి స్థాయిలో అవగాహన ఉంటోందని.. ఎవరేమిటో అందరికీ తెలుసని టీడీపీ నేతలు చెబుతున్నారు. మోత్కుపల్లి యాత్ర చేసినా దానికి ముద్రగడ ఏర్పాట్లు చేసినా ఈ తతంగం అంతా అంతా బీజేపీ కనుసన్నల్లలోనే వారి ఫండింగ్ తోనే నడుస్తుంది అని అర్ధం అవుతుంది అని వారు అంటున్నారు. ఆపరేషన్ గరుడలో ఇది తదుపరి ఘట్టం అని ప్రజలకి అర్ధం అవుతుంది అని వారు పేర్కొంటున్నారు.