మోటోరోలా సరికొత్త ఫీచర్లతో వచ్చేసిన Moto G14… రూ.10 వేలలోపే..

Moto G14 smartphone
Moto G14 smartphone

మోటోరోలా భారత మార్కెట్లో కొత్త బడ్జెట్ Moto G14 స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది.మరో కొత్త మొబైల్ తక్కువ బడ్జెట్లో మోటో నుంచి వచ్చేసింది. ప్రస్తుతానికి ఒక వేరియంట్ మన దేశంలో మాత్రమే లాంచ్ చేయబడింది. ఇది కూడా 4GB+128GB స్టోరేజీతో, రూ.9,999 ధర మాత్రమే వస్తుంది. ఈ Moto G14 స్మార్ట్‌ఫోన్ స్కై బ్లూ , స్టీల్ గ్రే కలర్లలో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్లు రాబోయే రోజుల్లో మరికొన్ని రంగుల్లో రిలీజ్ కానున్నాయని మోటోరోలా కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. మన దేశంలో Moto G14 స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 8 మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది. ఈ స్మార్ట్‌ఫోన్లు Motorola , Flipkart ఇండియా వెబ్‌సైట్, రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయొచ్చు. ICICI బ్యాంకు కార్డులను ఉపయోగించి ఫ్లిప్‌కార్ట్ ద్వారా Moto G14 స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారు రూ.750 ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను పొందొచ్చు. అప్పుడు ఈ ఫోన్ రూ.9249కే వస్తుంది.