ఫ్లిప్‌కార్ట్ బిన్నీ బన్సాల్ రాజీనామా కి అక్రమసంబంధం లింకు

Flipkart CEO Binny Bansal Resigns After Probe Into Personal

ఇండియన్ ఆన్లైన్ మార్కెట్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సహవ్యవస్థాపకుడు అయిన బిన్నీ బన్సాల్ (37) తన సీఈఓ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వ్యక్తిగత దుష్ప్రవర్తన అనే కారణంతో అతనిపైన ఫ్లిప్‌కార్ట్ వేటు వేసింది. కానీ, ఆ వేటు వెనుక ఉన్న అసలు కారణం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే, బిన్నీ బన్సాల్ ఫ్లిప్‌కార్ట్ కు సీఈఓ గా వ్యవహరిస్తున్న సమయంలో ఆ సంస్థలో పనిచేసిన ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం బయటపడింది. ఈ విషయం కంపెనీ కి చెందిన స్వతంత్ర దర్యాప్తు బృందం తెలిపింది. బిన్నీ బన్సాల్ తో వివాహేతర సంబంధం తన పూర్తి సమ్మతి తోనే ఆ మహిళ పెట్టుకున్నా, ఈ వ్యవహారం పైన కంపెనీ లో పనిచేస్తున్న మరో మహిళా ఉద్యోగి జులై నెలలో ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు చేసిన సదరు మహిళ వివరాలను గోప్యంగా ఉంచారు.

flip-kart

ఇలా తనపై వచ్చిన ఆరోపణలపైనా బిన్నీ బన్సాల్ ఏవిధంగా కూడా స్పందించకపోవడంతో వాల్‌మార్ట్ అతడిని సంస్థ విధులనుండి తప్పుకోవాలని సూచించడంతో బిన్నీ బన్సాల్ రాజీనామా చేశారు. ఇలా చేయడం ద్వారా సంస్థ తమ విచారణలో పారదర్శకతని, తద్వారా ఉద్యోగుల క్రమశిక్షణ విషయంలో సరైన నడవడికకు సంకేతాలను ఇచ్చినట్లయింది. తనపైన వచ్చిన ఈ ఆరోపణలపైన సరైనవిధంగా స్పందించేలోపే, విచారణ పూర్తికాకమునుపే బిన్నీ బన్సాల్ తన పదవికి రాజీనామా చేసేలా ఒత్తిడి చేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయినా, సుప్రీం కోర్ట్ కూడా చెప్పింది కదా పరస్పర అంగీకారంతో వివాహేతర సంబంధం ఆమోదయోగ్యమని. మరి, ఈ బిన్నీ బన్సాల్ వంటి సీఈఓ పైనే ఇంత పెద్ద వేటు వేయడానికి గల కారణాలు ఇంకేమైనా ఉండి ఉంటాయా అని పలువురు పలువిధాలుగా గుసగుసలాడుతున్నారు.

Binny-Bansal

బిన్నీ బన్సాల్ కి ఇప్పటికే త్రిష బన్సాల్ అనే భార్య ఉంది. అయినప్పటికీ ఈ అక్రమసంబంధం నెరపడానికి గల కారణం ఏమిటో. అమెజాన్ సంస్థలో కొన్ని నెలలు పనిచేసిన తరువాత, బిన్నీ బన్సాల్ తన స్నేహితుడు సచిన్ బన్సాల్ తో కలిసి ఫ్లిప్‌కార్ట్ సంస్థని 2007 లో నెలకొల్పాడు. 2018 లో వాల్ మార్ట్ అనే అంతర్జాతీయ సంస్థ ఫ్లిప్‌కార్ట్ లో 77 శాతం వాటాను కొనుగోలు చేసింది. బిన్నీ బన్సాల్ కి ఫ్లిప్‌కార్ట్ సంస్థలో ఒక బిలియన్ డాలర్ విలువ గల 5.5 శాతం వాటా ఉంది.