ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం చైనా నుండి జామర్లు…!

Rajamouli Using Jammers For RRR Movie

టాలీవుడ్‌ ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ మల్టీస్టారర్‌ మూవీ తాజాగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెల్సిందే. ఇన్ని రోజులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన జనాలు ఇప్పుడు సినిమా గురించిన అప్‌ డేట్స్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందున్న ఈ చిత్రంకు సంబంధించిన ఏ చిన్న విషయంలో కూడా అజాగ్రత్తగా ఉండవద్దని రాజమౌళి భావిస్తున్నాడు. అందుకోసం రాజమౌళి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. ఈమద్య కాలంలో ప్రతి సినిమాకు లీక్‌ల బాద తప్పడం లేదు. సెట్‌లో మొబైల్స్‌ నిషేదించినా కూడా ఏదో విధంగా సినిమాకు సంబంధించిన స్టిల్స్‌ లీక్‌ అవుతూనే ఉన్నాయి.

rrr-movies

రాజమౌళి లీక్‌ నుండి తన సినిమాను కాపాడుకునేందుకు చైనా నుండి జామర్‌ ను తెప్పించినట్లుగా తెలుస్తోంది. అత్యాధునిక టెక్నాలజీతో తయారు అయిన ఆ జామర్‌ ఉంటే ఎలాంటి వీడియో కెమెరాలు, సిసి కెమెరాలు, హిడెన్‌ కెమెరాలు పని చేయవట. సెల్‌ ఫోన్‌ లు సెట్‌లోకి తీసుకు వెళ్లే అవకాశం లేకున్నా కూడా కొందరు రహస్య కెమెరాలను తీసుకు వెళ్లే అవకాశం ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా జామర్‌ను వాడుతున్నట్లుగా తెలుస్తోంది. కోకా పేట్‌లో మొదటి షెడ్యూల్‌ ప్రారంభం కాబోతుంది. సినిమాలో చరణ్‌ పాత్ర ఏంటీ, ఎన్టీఆర్‌ ఎలా కనిపించబోతున్నాడు, సినిమాలో హీరోయిన్స్‌ ఎవరు అంటూ అనేక ప్రశ్నలు ప్రస్తుతం సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అంటూ అప్పుడే ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. తెలుగుతో పాటు సౌత్‌ భాషలన్నింటిలో మరియు హిందీలో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

RRR-Launch-Event