ప్రాణ హాని ఉంది రివాల్వర్ ఇప్పించండి !

MS Dhoni's wife Sakshi Dhoni Applies For Gun License

భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి సింగ్ తనకు ప్రాణహానీ ఉందని అందుకే తన ఆత్మరక్షణ కోసం 0.32 రివాల్వర్ లేదా పిస్టల్ వాడేందుకు లైసెన్స్ కావాలని ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు దరఖాస్తు చేసింది. తన భర్త వృత్తి రీత్యా బయట ప్రదేసాలలోనే ఎక్కువ ఉండడంతో తన కూతురితోపాటు ఇంట్లో ఒంట‌రిగానే ఉంటాను. ఎక్కువ సేపు ఒంటరిగానే ఇంటిలో నివసించాల్సి వస్తుందని అలాగే బయటకు వెళ్లినప్పుడు కూడా కొన్ని పనులు ఒంటరిగానే చేయవలసి వస్తుందని ఒక సెలబ్రిటీ భార్యగా తనకు అప్పుడప్పుడు బయట వ్యక్తులతో ముప్పు ఎదురయ్యే అవకాశం ఉందని అందుకే ఆత్మరక్షణ కోసం రివాల్వర్ వాడేందుకు లైసెన్స్ ఇవ్వాలని ప్ర‌భుత్వానికి సాక్షి అప్లికేష‌న్ పెట్టుకున్నారు. వీలైనంత త్వ‌రగా లైసెన్స్‌డ్ పిస్ట‌ల్ లేదా 0.32 రివాల్వ‌ర్ ఇప్పించండి` అని సాక్షి త‌న అప్లికేష‌న్‌లో పేర్కొన్నారు.

అయితే 2010లో ధోని కూడా స్వయంగా రివాల్వర్ కోసం దరఖాస్తు చేశారు. ప్రస్తుతం ఆయన తనవద్ద 9 ఎంఎం పిస్టల్ కలిగి ఉన్నారు. సాధారణంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ లైసెన్స్‌లను మంజూరు చేస్తుంది. ఆర్మ్స్ యాక్ట్ 1959 క్రింద కొన్ని అత్యవసరమైన పరిస్థితుల్లోనే ప్రభుత్వం ఎవరికైనా గన్ లైసెన్స్ మంజూరు చేస్తుంది. గన్ లైసెన్స్ పొందే వ్యక్తికి ఎలాంటి క్రిమినల్ రికార్డు ఉండకూడదు. అలాగే డీసీపీ స్థాయి అధికారి ద్వారా దరఖాస్తు చేసుకున్న వ్యక్తిపై ఎంక్వయరీ జరుగుతుంది. ప్రస్తుతం పలువురు సినీ నటులతో పాటు రాజకీయ నాయకులకు కూడా మన దేశంలో గన్ లైసెన్స్ ఉంది.