ముద్రగడకి ఆ ఛాన్స్ ఇచ్చిన జగన్.

mudragada-comments-on-jagan

సీఎం చంద్రబాబు నాయుడు మీద కాపు రిజర్వేషన్ సహా వివిధ అంశాలపై నిప్పులు చెరిగే ముద్రగడ పద్మనాభం కి వైసీపీ అధినేత జగన్ భలే ఛాన్స్ ఇచ్చారు. ఆ ఛాన్స్ ఏంటో తెలుసా ? జగన్ ని కాపు రిజర్వేషన్స్ విషయంలో ఓ ఆట ఆడుకునే ఛాన్స్. 2016 లో కాపు రిజర్వేషన్స్ కి మద్దతు ఇచ్చిన జగన్ తాజాగా పాదయాత్ర లో అది సాధ్యం కాదని తేల్చేయడంతో ముద్రగడ రెచ్చిపోయారు. ఇన్నాళ్లు చంద్రబాబుని తిట్టిన ముద్రగడ ఇప్పుడు జగన్ వైఖరిని తీవ్రస్థాయిలో తప్పు పట్టారు. కాపుల ని ఓట్లు అడిగే హక్కు లేదని ముద్రగడ తేల్చేశారు. ఇంకా జగన్ మీద ముద్రగడ ఏమన్నారో కింది బులెట్ పాయింట్స్ చూడండి.

కాకినాడ కాపు జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వాసిరెడ్డి ఏసుదాసు నివాసంలో పత్రికా సమావేశంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మాట్లాడిన కామెంట్స్…

  • బి.సి లోని చేర్చడం ..రాష్ట్రం పరిది లో లేదు .కేంద్రం పరిది లో ఉంది అంటున్నారు…ఇదీ దారుణం.
  • తుని సంఘటన సమయం లో మాకు మద్దతు ఇచ్చిన జగన్..ఇప్పుడు ఇలా మాట్లడo దారుణం…. ముద్రగడ.
  • మా కులాలు వారు మీకు దాసోహం గా ఉండాలా ..
  • మాకు ప్రత్యేక కేటగిరీ పేట్టి.మాకు కోంత సహయం చేయ్యండీ .తప్ప మిగిలిన కులాలు నష్టం కల్గించేలా మేము చేయ్యమని అనలేదు..
  • ఎక్కడ మా జాతి కోసం ఉద్యమం పుట్టిందో అక్కడ.జగన్ మోహన రేడ్డి కాపులను బి.సి లో చేర్చడం కుదరదు అని మాట్లాడడం ఏంత వరకు న్యాయం..
  • కేంద్రం పరిది లో ఉన్నా చాల అంశాల కోసం జగన్..పోరాడుతున్నరు…దాని కోసం మీరు పోరాడుతున్నప్పుడు ఈ అంశం మీకు సాద్యం కదా..
  • మీరు పాదయాత్ర లో అనేక హామీలు …ఇస్తున్నరు ..మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అంతే ..కేంద్రం బడ్జేటు కూడ సరిపోదు…
  • ఇదీ సాద్యం కాదు అన్నప్పుడు మా కులం సంబందించిన ఓట్లు మీకు ఏందుకు …
  • మా జాతి సమస్య మీరు తీర్చనప్పుడు మీకు మేము ఎందుకు ఓట్లు వేయ్యాలి..
  • మి అధికారం కోసం మా జాతి ఓట్లు మీకు కావాలి తప్ప ..మా జాతికి న్యాయం చేయడం వచ్చేసరికి కేంద్రం పరిదిలో ఉంది అనడం ఎంత వరకు న్యాయం.
  • మీ పాదయాత్ర కోసం మా జాతి నాయకులను లక్షల్లో కోట్ల ఖర్చు చేయిస్తున్నరు…