ముకేశ్ అంబానీ కోడ‌లెవ‌రో తెలుసా…?

mukesh ambani son gets married to Russell Mehta Daughter

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

వ్యాపార దిగ్గ‌జ కుటుంబాల్లో భారీ పెళ్లివేడుక‌కు రంగం సిద్ద‌మ‌యింది. దేశంలోనే అత్యంత సంప‌న్నుడు ముఖేశ్ అంబానీ ఇంటికి… మ‌రో సంపన్న‌కుటుంబానికి చెందిన అమ్మాయి కోడ‌లిగా రానుంది. ముఖేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ… వ‌జ్రాల వ్యాపారి, రోజీ బ్లూ డైమండ్స్ అధినేత ర‌సెల్ మెహ‌తా చిన్న‌కుమార్తె శ్లోక వివాహ బంధంతో ఒక్క‌టి కానున్నారు. త్వ‌ర‌లోనే నిశ్చితార్థం తేదీ ప్ర‌క‌టించి, డిసెంబ‌ర్ ప్రారంభంలో పెళ్లి వేడుక జ‌ర‌ప‌నున్నారు. అయితే ఇరు కుటుంబాలు దీనిపై ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న చేయలేదు. ఆకాశ్, శ్లోక‌ది పెద్ద‌లు కుదిర్చిన వివాహంకాదు. వారిద్ద‌రూ ఒక‌రినొక‌రు మ‌న‌సారా ఇష్ట‌ప‌డ్డారు.

ఇంట‌ర్ చ‌దివేరోజుల్లోనే వారి మ‌ధ్య ప్రేమ చిగురించింది. ఇద్ద‌రూ ధీరూభాయ్ అంబానీ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ లో క‌లిసి చ‌దువుకున్నారు. అక్క‌డే ఒక‌రినొకరు ఇష్ట‌ప‌డ్డారు. ఇంట‌ర్ ప‌రీక్ష‌లు పూర్తికాగానే ఆకాశ్ శ్లోక‌కు త‌న ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రిచిన‌ట్టు, శ్లోక కూడా అత‌ని ప్రేమ‌ను అంగీక‌రించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ ఛైర్మ‌న్ ముకేశ్ అంబానీ, రిల‌య‌న్స్ ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌కురాలు నీతా అంబానీల పెద్ద‌కుమారుడైన ఆకాశ్ అంబానీకి క‌వ‌ల సోద‌రి ఇషా అంబానీ, త‌మ్ముడు అనంత్ అంబానీ ఉన్నారు. ధీరూభాయ్ అంబానీ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ లో విద్యాభ్యాసం పూర్త‌యిన త‌ర్వాత అమెరికాలోని బ్రౌన్ యూనివర్శిటీ నుంచి అర్థ‌శాస్త్రంలో డిగ్రీ పూర్తిచేశారు. రిల‌య‌న్స్ జియో ఇన్ఫోకామ్ వ్యూహ‌ర‌చ‌న‌లో ఆకాశ్ ముఖ్యుడు.
శ్లోక స్కూల్ చ‌దువు ముగిసిన త‌రువాత ప్రిన్స్ ట‌న్ యూనివ‌ర్శిటీ నుంచి ఆంత్రోపాల‌జీలో డిగ్రీ, ది లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎక‌న‌మిక్స్ అండ్ పొలిటిక‌ల్ సైన్స్ నుంచి న్యాయ‌విద్య‌లో మాస్ట‌ర్స్ పూర్తిచేశారు. 2014 జులైనుంచి రోజీ బ్లూ స్వచ్ఛంద సంస్థ‌లో డైరెక్ట‌ర్ గా కొన‌సాగుతున్నారు. ర‌సెల్ మెహ‌తా, మోనాల ముగ్గురు సంతానంలో శ్లోక చిన్న‌ది. పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ ను ముంచేసి ప‌రారైన నీర‌వ్ మోదీకి మోనా బంధువు.