గోవాలో ఆకాశ్ అంబానీ, శ్లోక నిశ్చితార్థం

Mukesh Ambani's Son Akash Engagement With Shloka Mehta In Goa

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]రిల‌య‌న్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ నిశ్చితార్థం పూర్తయింది. గోవాలో స్నేహితులు, అత్యంత స‌న్నిహితుల న‌డుమ శ‌నివారం ఆకాశ్ త‌న చిన్న‌నాటి స్నేహితురాలు శ్లోకామెహ‌తా చేతికి నిశ్చితార్థం ఉంగ‌రం తొడిగారు. ఆకాశ్ ఎడ‌మ‌చేతిపై శ్లోకా ఉంగ‌రం తొడిగిన త‌న ఎడ‌మ‌చేతిని ఉంచి న‌వ్వుతూ చూస్తున్న ఫొటో, కాబోయే కోడ‌లికి ముఖేశ్ అంబానీ స్వీట్ తినిపిస్తున్న ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. ఆకాశ్, శ్లోక వివాహం డిసెంబ‌ర్ లో స్విట‌ర్లాండ్ లో ఘ‌నంగా జ‌ర‌గ‌నున్న‌ట్టు స‌మాచారం. కుమారుడి ఎంగేజ్ మెంట్ పై త‌ల్లి నీతా అంబానీ స్పందించారు.

శ్లోక నాలుగేళ్ల వ‌య‌సు నుంచే త‌న‌కు తెలుస‌ని, ఆమెను త‌మ కుటుంబంలోకి ఆనందంగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు.  ప్ర‌పంచంలోనే అతిపెద్ద వ‌జ్రాల కంపెనీ అయిన రోజీ బ్లూ డైమండ్స్ అధినేత ర‌సెల్ మొహ‌తా కుమార్తె శ్లోక‌. ధీరూభాయ్ అంబానీ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ లో క‌లిసి చ‌దుకునేట‌ప్ప‌టి నుంచే ఆకాశ్, శ్లోక మ‌ధ్య ప‌రిచ‌యం ఉంది. ఇంట‌ర్ లో ఆకాశ్ శ్లోకకు ప్ర‌పోజ్ చేయ‌గా..ఆమె అంగీక‌రించింది. చ‌దువులు పూర్తిచేసి వార‌స‌త్వ వ్యాపారాల్లో స్థిర‌ప‌డ‌డం, కుటుంబ స‌భ్యులు కూడా వారి ప్రేమ‌కు అభ్యంత‌రాలు చెప్ప‌క‌పోవ‌డంతో ఇద్ద‌రూ పెళ్లిచేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. 

akash ambani engagement