నిసర్గ తుఫాను…ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న ముంబై వాసులు

నిసర్గ తుఫాను...ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న ముంబై వాసులు

అరేబియా సముద్రంలో పుట్టిన నిసర్గ తుఫాను… మహారాష్ట్ర, గుజరాత్ తీరాన్ని తాకింది. మధ్యాహ్నం 1 గంట తర్వాత ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ తీరం దగ్గర ఉన్న హరిహరేశ్వర్ దగ్గర్లో అది తీరం దాటుతుంది వాతావరణ అధికారులు చెప్పినట్లుగానే అది తీరాన్ని తాకింది. ప్రస్తుతం అక్కడ గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. సాయంత్రం 4 గంటల సమయానికి తుఫాను పూర్తిగా తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ వర్షాలు ఈదురు గాలులు వీస్తున్నాయి. వాతావరణం అల్లకల్లోలంగా ఉంది.

ఈ తుఫాను వల్ల ముంబై, పాల్ఘర్, థానే, రాయ్‌గఢ్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు జూన్ 4 వరకూ పడతాయని అంచనా వేశారు. అలాగే… రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలో భారీ వర్షాలు పడొచ్చంటున్నారు. ఇక గోవా, దక్షిణ గుజరాత్, డమన్, దాద్రా నగర్ హవేలీలో వచ్చే 24 గంటలపాటూ… వానలు పడతాయని అంచనా వేశారు.తుఫాను వల్ల తీర ప్రాంతం వర్షంతో అల్లకల్లోలంగా ఉంది. అలలు ఎగసి పడుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసింది. తీరం దాటిన తుఫాను… అర్థరాత్రి సమయంలో తుఫాను బలహీన పడుతుందనీ… గురువారం ఉదయానికి పూర్తిగా ప్రభావం తగ్గుతుందని చెప్పారు.

ఈ తుఫానుపై రాష్ట్రాల ప్రభుత్వాలతోపాటూ… కేంద్రం కూడా చాలా అప్రమత్తంగా ఉంది. ప్రత్యేకించి NDRF బృందాలు రెండ్రోజులుగా సహాయ కార్యక్రమాల్లో ఉన్నాయి. తీర ప్రాంతాల్లో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మహారాష్ట్ర, గుజరాత్, దాద్రానగర్ హవేలీ, డయ్యూ డమన్‌కి 33 NDRF బృందాలు వెళ్లాయి. ఒక్కో బృందంలో 45 మంది ఉన్నారు.

అందరూ తుఫాను వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు.మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, డయ్యూ డామన్, దాద్రానగర్ హవేలీ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ కే పటేల్‌కు ప్రధాని మోదీ ఫోన్‌చేసి వివరాలు తెలుసుకున్నారు. తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి అవసరమైన సహాయం చేస్తామని చెప్పారు.