నాపేరు సూర్య ఆసక్తికర అప్‌డేట్‌

Naa peru surya movie Some scenes cutting

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అల్లు అర్జున్‌, అను ఎమాన్యూల్‌ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నా పేరు సూర్య’. ఆర్మీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యింది. ఆర్మీ ట్రైనింగ్‌ ఎలా ఉంటుంది, ఎంత కఠినంగా ఉంటుందనే విషయాలను ఇప్పటి వరకు ఇండియన్‌ స్క్రీన్‌పై చూపించలేదు. ఇటీవలే విడుదలైన పస్ట్‌ ఇంపాక్ట్‌ వీడియో మరియు పోస్టర్‌ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. భారీ స్థాయిలో ఈ చిత్రం బిజినెస్‌ అవుతుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళంలోనే కాకుండా ఇంకా పలు భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని చాలా చాలా జాగ్రత్తగా ప్లాన్‌ చేయాలని భావిస్తున్నారు.

ఇక ఈ చిత్రంకు సంబంధించిన కొన్ని సీన్స్‌ విషయంలో నిర్మాత అల్లు అరవింద్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఆ సీన్స్‌ను కట్‌ చేయాలని దర్శకుడికి సూచించాడట. ఈ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్‌ కూడా అందుకు సరే అనడంతో ప్రస్తుతం అందుకు సంబంధించిన ఎడిటింగ్‌ వర్క్‌ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్‌కు సైతం ఆ సీన్స్‌ అంతగా నచ్చలేదని, అల్లు అరవింద్‌ చెప్పడంతో అంతా కూడా ఆ సీన్స్‌ను తొలగించే నిర్ణయం తీసుకున్నారు. ఆర్మీ నేపథ్యం అవ్వడంతో ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూపించాల్సిన అవసరం ఉంది. ఏ చిన్న తప్పు జరిగినా కూడా పరిణామాలు సీరియస్‌గా ఉంటాయి అనే విషయం చిత్ర యూనిట్‌ సభ్యులకు తెలుసు. అందుకే ఒకటికి పది సార్లు ఆలోచించి సీన్స్‌ను రెడీ చేస్తున్నారు. ఈ చిత్రం మే మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.