‘నా పేరు సూర్య’కు ఓవర్సీస్‌లో పరాభవం

naa peru surya naa illu india movie overseas

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అల్లు అర్జున్‌ హీరోగా అను ఎమాన్యూల్‌ హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ‘నా పేరు సూర్య’. ఈ చిత్రంకు ఆశించిన స్థాయిలో ఆధరణ దక్కలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించి కేవలం మొదటి వారంలోనే 100 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించింది అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు గొప్పగా చెప్పుకున్నారు. సినిమా అంతగా ఆకట్టుకోలేక పోయినా కూడా కలెక్షన్స్‌ మాత్రం బాగా వచ్చాయని చెబుతున్నారు. అయితే ఆ విషయంలో నిజం లేదని తాజా లెక్కలు చెబుతున్నాయి. ఈమద్య కాలంలో ఓవర్సీస్‌లో చిన్న హీరోలు సైతం మిలియన్‌ మార్క్‌ను క్రాస్‌ చేస్తున్నారు. కాని ఈ సినిమా ముక్కు మూల్గి హాఫ్‌ మిలియన్‌ మార్క్‌ను క్రాస్‌ చేసింది. ఎంత ప్రయత్నించినా కూడా మిలియన్‌ డాలర్లు మాత్రం ఈ చిత్రం ఖాతాలో పడలేదు.

‘నా పేరు సూర్య’ చిత్రంకు విడుదలకు ముందు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. దాంతో తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో ఓవర్సీస్‌లో ఈ చిత్రాన్ని ఏకంగా 4 కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది. పెట్టుబడి రికవరీ అవ్వాలి అంటే కనీసం 1.5 మిలియన్‌ డాలర్లను వసూళ్లు చేయాలి. కాని ఈ చిత్రం కనీసం మిలియన్‌ డాలర్లను కూడా వసూళ్లు చేయలేక పోయింది. దాంతో అక్కడ డిస్ట్రిబ్యూటర్లు లబోదిబో అంటున్నారు. అల్లు అర్జున్‌ను నమ్ముకుంటే నట్టేటా ముంచాడు అంటూ ఓవర్సీస్‌ బయ్యర్లు సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా అల్లు అర్జున్‌ నటించిన చిత్రాలు ఓవర్సీస్‌లో ఆకట్టుకోలేక పోయాయి. తెలుగులో మంచి వసూళ్లు సాధించినా కూడా ఓవర్సీస్‌లో మాత్రం అల్లు అర్జున్‌కు వరుసగా పరాభవాలు తప్పడం లేదు.