అప్పుడే ముగించనున్న బన్నీ

Naa Peru Surya shooting at Indo-Pak border
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అల్లు అర్జున్‌ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నాపేరు సూర్య’. ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ చిత్రం విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది. కాని సినిమా షూటింగ్‌ మాత్రం పూర్తి అవ్వబోతుంది. ఇటీవలే ఇండియా, పాకిస్తాన్‌ బౌర్డర్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించిన చిత్ర యూనిట్‌ సభ్యులు తాజాగా క్లైమాక్స్‌ చిత్రీకరణకు సిద్దం అవుతున్నారు. దాంతో షూటింగ్‌ మొత్తం పూర్తి అవుతుందని దర్శకుడు వక్కంతం వంశీ చెప్పుకొచ్చాడు.

సినిమా విడుదలకు రెండు నెలు ఉండగానే షూటింగ్‌ పూర్తి అవుతున్న నేపథ్యంలో భారీగా ప్రమోషన్‌ చేసే అవకాశాలున్నాయి. దేశ వ్యాప్తంగా పలు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకే దేశ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రమోషన్‌ కోసం చిత్ర యూనిట్‌ సభ్యులు తిరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపబోతున్నారు.

అతి త్వరలోనే సినిమా షూటింగ్‌ను పూర్తి చేయనున్నట్లుగా చిత్ర యూనిటన సభ్యులు చెబుతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతూ వస్తున్నారు. ఆర్మీ ట్రైనింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన మొదటి ఇండియన్‌ చిత్రంగా నా పేరు సూర్య రికార్డు సాధించబోతుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. బన్నీకి జోడీగా అను ఎమాన్యూల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. వరుస విజయాలతో దూసుకు పోతున్న బన్నీకి ఇది మరో విజయాన్ని తెచ్చి పెట్టడం ఖాయం అంటూ మెగా ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉన్నారు.