2018లో మొదటి సక్సెస్‌

positive talk on varun tej tholi prema movie
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కొత్త సంవత్సరం ప్రారంభం అయ్యి నెల రోజులు గడిచినా ఇంకా టాలీవుడ్‌కు సక్సెస్‌ దక్కలేదే అని బాధపడుతున్న సమయంలో వచ్చిన ‘తొలిప్రేమ’ చిత్రం మంచి విజయానిన సొంతం చేసుకుంది. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘తొలిప్రేమ’ చిత్రం పాజిటివ్‌ టాక్‌ను దక్కించుకుంది. ముఖ్యంగా యూత్‌ ఆడియన్స్‌ ఈ చిత్రానికి బ్రహ్మర్థం పడుతున్నారు. సూపర్‌ హిట్‌, కొత్త ప్రేమ కథ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఒక సహజ సిద్దమైన ప్రేమ కథతో దర్శకుడు వెంకీ అట్లూరి 2018లో మొదటి సక్సెస్‌ను దక్కించుకున్నాడు. ‘ఫిదా’తో ప్రేక్షకులను ఫిదా చేసిన మెగా హీరో వరుణ్‌ తేజ్‌ ఈసారి మళ్లీ సక్సెస్‌ను దక్కించుకుని మరో మెట్టు పైకి ఎదిగాడు.

భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అజ్ఞాతవాసి’, ‘భాగమతి’, ‘జైసింహా’, ‘ఇంటిలిజెంట్‌’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. అయితే పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన తొలిప్రేమ మాత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి రెండు రోజుల్లోనే ఓవర్సీస్‌లో హాఫ్‌ మిలియన్‌ డార్లను వసూళ్లు చేసిన ఈ చిత్రం అంచనాను తారుమారు చేసింది. త్వరలోనే మిలియన్‌ మార్క్‌ను చేరుతుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. ఇక మరో వైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్నట్లే అంటూ ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. సినిమాలు పెద్దగా లేని ఈ సమయంలో వచ్చిన ‘తొలిప్రేమ’కు మంచి కలెక్షన్స్‌ వస్తాయనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. వరుణ్‌, రాశిఖన్నా జంటగా నటించిన ‘తొలిప్రేమ’ చిత్రాన్ని వెంకీ అట్లూరి దర్శకత్వంలో బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన విషయం తెల్సిందే.