అల్లు అర్జున్ క్యారవాన్…చాలా స్పెషల్

allu arjun caravan so special

టాలీవుడ్ హీరోల్లో విలాశవంతమైన కార్వాన్ వున్న హీరోలో మహేష్ బాబు పేరు వినిపిస్తది. ఆయన కార్వాన్ ఖరీదు పదికోట్లు పైనే అని చెబుతారు. కాగా ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఓ విలాసవంతమైన కార్వాన్ ని సొంతం చేసుకున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త‌ను వాడే ప్రాప‌ర్టీస్ అన్నీ చాలా స్టైలిష్‌గా ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు. ముఖ్యంగా అత‌ని కారవాన్ ని ముంబైకి చెందిన వ్య‌క్తికితో ఈ మధ్యే ప్ర‌త్యేకంగా త‌యారు చేయించుకున్నాడ‌ట బ‌న్నీ. మూడు కోట్లు పెట్టి ఇంటీరియ‌ర్ డెక‌రేష‌న్ చేయించుకోగా, ఈ కార్ వ్యాన్ ధ‌ర రూ. 7 కోట్ల పై మాటే అంటున్నారు. ఇంత ల‌గ్జ‌రీ కారవాన్ ని వాడే రెండో టాలీవుడ హీరో అల్లు అర్జున్ నే అంటున్నారు. ఈ కారవాన్ ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంద‌ట‌. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా త‌ర్వాత బ‌న్నీ త్రివిక్రమ్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 19వ చిత్రాన్ని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం ప్ర‌స్తుతం రెండో షెడ్యూల్ జ‌రుపుకుంటుంది. ఈ సినిమా సెట్ లో ఈ కారవాన్ ప్రత్యక్షం అయ్యిందట. థమన్ మ్యూజిక్ అందిస్తున్నా ఈ ఏడాది చివర్లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు.