ప్రియుడి మీద అతని సోదరి మీద పెట్రోల్ పోసి అంటించిన వివాహిత

poured petrol on lover and his sister

విజయవాడ సనత్ నగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడు, అతని సోదరి మీద ముంతాజ్‌ అనే ఆమె పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో అతని సోదరి హజున్నీ మృతి చెందగా, ప్రియుడు ఖలీల్‌ కు తీవ్ర గాయాలయ్యాయి. ఖలీల్‌ కి అన్న భార్య ముంతాజ్‌తో ఖలీల్‌కు వివాహేతర సంబంధం ఉంది.  అయితే ఆయన ఆ బంధాన్ని పట్టించుకోకుండా మూడు నెలల క్రితం మరో యువతిని పెళ్లి చేసుకున్నారు. అయితే తనను పట్టించుకొని ఖలీల్‌ ని, అతని జీవితంలోకి వచ్చి తనకు అతన్ని దూరం చేసిన అతని భార్యను కలిపి చంపేందుకు ముంతాజ్‌ కుట్రపన్నింది. ఈ నేపథ్యంలో ఖలీల్‌ భార్య అనుకొని ఖలేల్ పక్కనే నిద్రిస్తున్న సోదరిపై పెట్రోల్ పోసి ముంతాజ్ నిప్పంటించింది. అయితే  మృతురాలు హజున్నీ మానసిక వికలాంగురాలు కావడం గమనార్హం.