ఉండవల్లి ట్రాప్ లో పవన్ .

pawan kalyan change strategy after meeting undavalli aruna kumar
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా సాధన కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడానికి జనసేన అధినేత మొదలెట్టిన ప్రయాణం కొత్త మలుపులు తిరిగేలా వుంది. లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణతో భేటీ తర్వాత జాక్ గురించి మాట్లాడిన పవన్ , ఉండవల్లితో సమావేశం తర్వాత కాస్త రూట్ మార్చుకున్నట్టుంది. ఇప్పుడు బీజేపీ , టీడీపీ మధ్య విభజన హామీల చుట్టూ సాగుతున్న పోరాటంలో ఎవరిది నిజమో తేల్చే పనిలో పడ్డారు. నిజానికి ఈ పోరాటం బీజేపీ , టీడీపీ లను బజారుకు ఈడ్చింది. ఇద్దరు చేసిన తప్పులు బయటకు వచ్చాయి. నిజానికి ఇలాంటి సందర్భం ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి గానీ , అటు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కి గానీ రాజకీయంగా ఓ మంచి అవకాశం. అధికారంలో వున్న వాళ్ళ తప్పులు ఎత్తి చూపే అరుదైన అవకాశం. ఈ బంగారం లాంటి అవకాశాన్ని వాడుకోవడంలో జగన్ విఫలం అయ్యాడు. అందుకు కారణం అవినీతి కేసుల వ్యవహారంలో బీజేపీ సాయ అవసరం అని తేలిగ్గానే అర్ధం అవుతోంది. అవకాశం వచ్చినప్పుడు కూడా బీజేపీ ని వదిలేసి ఒక్క టీడీపీ మీదే విమర్శలు చేయడం వల్ల టీడీపీ కి ఎంత నష్టం జరుగుతుందో గానీ వైసీపీ కి అంతకన్నా ఎక్కువ నష్టం జరుగుతోంది.

 

ఇక పవన్ కళ్యాణ్ అటు కేంద్రం , ఇటు రాష్ట్రం చెప్పే లెక్కల్లో నిజం ఎంతో తేలుస్తానంటున్నాడు. ప్రజల తరపున ప్రత్యేక హోదా లేదా ఇతర విభజన సమస్యల మీద పోరాటం చేయడం అంటే ఓకే గానీ కేంద్రం , రాష్ట్రం లెక్కలు తేలుస్తాననడం పవన్ కి సరికాదు. అసలు ఆయన ఏ స్థాయిలో ఈ జడ్జిమెంట్ చేయగలరు ? చేసినా …ఎవరిది తప్పని చెబితే ఎవరు ఊరుకుంటారు ?. ఇద్దరు తప్పు చేశారని తేలితే అప్పుడైనా ప్రజల కోసం గళం ఎత్తాల్సి ఉంటుంది. ఇప్పుడు కేంద్రం , రాష్ట్రం మధ్య లెక్కలు తేల్చాలి అనుకోవడం చూస్తుంటే ఉండవల్లి ట్రాప్ లో పవన్ పడ్డట్టుంది . జగన్ కి మేలు చేయాలని తహతహలాడే ఉండవల్లి బీజేపీ , టీడీపీ లను పవన్ తో దోషి అనిపించి ఈ ముగ్గురు కొట్టుకుంటుంటే వైసీపీ కి లబ్ది జరగాలని భావిస్తున్నట్లుంది. ప్రత్యేక హోదా సహా విభజన హామీలు నెరవేరలేదని క్లియర్ గా తెలిసిపోతోంది. అప్పుడు చేయాల్సింది అందుకు బాధ్యులైన వాళ్ళ మీద పోరాటమే. ఈ అవకాశాన్ని వదిలిపెట్టి మధ్యవర్తి పాత్రకు పరిమితం అయితే నాయకుడుగా ఎదిగే మంచి అవకాశాన్ని పవన్ ఇంకోసారి పోగొట్టుకున్నట్టే.