ఆసక్తికరంగా నితిన్‌ 25వ చిత్రం

nithin chal mohana ranga first look poster release
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

యంగ్‌ హీరో నితిన్‌ కెరీర్‌లో 25వ చిత్రంగా రూపొందుతున్న సినిమాకు ‘ఛల్‌ మోహన్‌ రంగ’ అనే టైటిల్‌ను ఖరారు చేయడం జరిగింది. పవన్‌ కళ్యాణ్‌ ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. కథ మరియు స్క్రీన్‌ప్లేను త్రివిక్రమ్‌ అందిస్తున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సోషియో ఫాంటసీ కథతో ఈ చిత్రం తెరకెక్కుతుందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. టైటిల్‌ విషయంలో సోషల్‌ మీడియాలో ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. చివరకు ఛల్‌ మోహన్‌ రంగ అనే టైటిల్‌ను ఈ చిత్రానికి ఖరారు చేయడం జరిగింది.

Nithin Chal Mohan Ranga First Look

 

ఇప్పటి వరకు ఈ చిత్రం కథపై చిత్ర యూనిట్‌ సభ్యులు ఎలాంటి లీక్‌లు ఇవ్వలేదు. దాంతో సినిమా ఎలా ఉంటుందనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. త్రివిక్రమ్‌ కథ మరియు పవన్‌ నిర్మాత అవ్వడం వల్ల సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. దర్శకుడు కృష్ణ చైతన్య మొదటి సినిమానే అయినా కూడా త్రివిక్రమ్‌ షాడో డైరెక్టర్‌గా వ్యవహరించి ఉంటాడు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే సినిమా తప్పకుండా ఆకట్టుకునే విధంగా ఉంటుందని అందరి నమ్మకం. ఇక ఈ చిత్రంలో నితిన్‌కు జోడీగా మేఘా ఆకాష్‌ హీరోయిన్‌గా నటించడం జరిగింది. ఫిబ్రవరి 14న సినిమా టీజర్‌ రాబోతుంది. టీజర్‌ రాకతో అయినా సినిమా కథేంటీ అనే విషయంపై క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఒక వేళ టీజర్‌లో క్లారిటీ ఇవ్వకుంటే ట్రైలర్‌లో ఖచ్చితంగా సినిమాపై ఒక అవగాహణ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌లో ‘ఛల్‌ మోహన్‌ రంగ’ ఉంది.

Nithin Chal Mohan Ranga First Look