మారుతి, చైతూ మూవీ అప్‌డేట్స్‌

naga chaitanya and maruthi new movie launching tomorrow

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అక్కినేని హీరో నాగచైతన్య ఇటీవలే ‘సవ్యసాచి’ చిత్రాన్ని మొదలు పెట్టిన విషయం తెల్సిందే. ఆ షూటింగ్‌ ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాకుండానే మరో సినిమాను చైతూ ప్రారంభించేందుకు సిద్దం అవుతున్నాడు. మారుతి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఒక సినిమా తెరకెక్కబోతున్నట్లుగా చాలా రోజుల క్రితమే ప్రకటన వచ్చింది. రేపు ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. భారీ ఎత్తున పూజా కార్యక్రమాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సినీ వర్గాల నుండి పలువురు ప్రముఖులు ఈ పూజా కార్యక్రమాలకు హాజరు అయ్యే అవకాశం ఉంది.

nag

మారుతి వరుసగా విజయాలు దక్కించుకుంటూ దూసుకు వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్న మారుతి పక్కా స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేసి జనవరిలో రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించబోతున్నాడు. జనవరి 5 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించబోతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మొదట సమంతను ఎంపిక చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మెహ్రీన్‌ను ఈ చిత్రం కోసం సంప్రదించినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.