జెట్‌ స్పీడ్‌లో చరణ్‌, బోయపాటి..

ram charan and boyapati srinu new movie opening

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రామ్‌ చరణ్‌ ‘ధృవ’ చిత్రం విడుదలై సంవత్సరం కావస్తుంది. ఇప్పటి వరకు తర్వాత సినిమా అయిన రంగస్థలంను విడుదల చేయలేదు. 2017 సంవత్సరంలో చరణ్‌ ఒక్క మూవీ కూడా విడుదల అవ్వడం లేదు. 2018లో ఈ గ్యాప్‌ను ఫిల్‌ చేసేందుకు రామ్‌ చరణ్‌ ప్రయత్నిస్తున్నాడు. 2018లో రెండు సినిమాలు విడుదల చేయడం ఖాయం అయ్యింది. రంగస్థలం చిత్రం వేసవి కానుకగా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఇక తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మొదలు పెట్టిన సినిమాను దసరాకు విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

ram-charan-and-boyapati-sri

నేడు పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జనవరిలో ప్రారంభం కాబోతుంది. షూటింగ్‌ను జెట్‌ స్పీడ్‌తో పూర్తి చేసి ఖచ్చితంగా సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. బోయపాటి శ్రీను ‘జయ జానకి నాయక’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుని జోరుమీదున్నాడు. వరుస విజయాలను దక్కించుకుంటున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్‌ మూవీ అంటే మెగా ఫ్యాన్స్‌ చాలా సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్స్‌ను సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. సంక్రాంతికి ‘రంగస్థలం’తో దసరాకు బోయపాటి చిత్రంతో చరణ్‌కు హిట్‌లు గ్యారెంటీ అంటూ అప్పుడే అభిమానులు అంచనాలు వేసుకుంటున్నారు. కేవలం నాలుగు నెలల్లోనే సినిమాను పూర్తి చేసేందుకు బోయపాటి ప్లాన్‌ చేస్తున్నాడు.