టెంపర్ దెబ్బకు బండ్లకు జైలుశిక్ష

6-months-jail-for-producer-bandla-ganesh

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఏ సంబంధం లేని నంది వివాదంలో తలదూర్చి మరోసారి వార్తల్లోకి ఎక్కిన నిర్మాత బండ్ల గణేష్ కు పెద్ద షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో అతనికి కోర్టు 6 నెలల జైలుశిక్ష తో పాటు 15 లక్షల జరిమానా విధించింది. ఈ ఎపిసోడ్ కి కారణం బండ్లకు హిట్ సినిమాగా , ఎన్టీఆర్ కెరీర్ ను మళ్ళీ గాడిలో పెట్టిన సినిమాగా నిలిచిన టెంపర్. ఇంతకీ టెంపర్ కు, బండ్లకు శిక్ష పడడానికి కారణం ఏంటో చూద్దాం.

bandla-ganesh

టెంపర్ సినిమాకు కథ అందించింది వక్కంతం వంశీ. ఆయనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ లో భాగంగా నిర్మాత బండ్ల గణేష్ ఇచ్చిన 25 లక్షల రూపాయల చెక్ బౌన్స్ అయ్యిందట. ఆ తర్వాత ఇదే విషయం మీద వంశీ ఎన్నిసార్లు బండ్లను కదిలించినా ప్రయోజనం లేకపోవడంతో న్యాయం కోసం ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ జరిపిన ఎర్రమంజిల్ కోర్టు బండ్లకు ఆరునెలల జైలుశిక్షతో పాటు 15 లక్షల జరిమానా వేసింది. అయితే షరతులతో కూడిన బెయిల్ కూడా కోర్టు మంజూరు చేసింది కోర్టు . దీంతో ప్రస్తుతానికి బండ్ల సేఫ్ అయినా ఈ చెల్లింపు చేయలేకపోతే ఇబ్బందులు తప్పవు.