ఇవాంకకు నంది అవార్డులు ఇవ్వాలన్న వర్మ

varma comments on kcm kcr and trump daughter ivanka

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఈనెల 28 నుండి హైదరాబాద్‌లో జరుగబోతున్న అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూతురు ఇవాంక ట్రంప్‌ రాబోతున్న విషయం తెల్సిందే. హైదరాబాద్‌లో ఇవాంక ఉండబోయేది మూడు రోజులే అయినా కూడా ఆమె కోసం దాదాపు 100 కోట్లు ఖర్చు చేసి మరీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇంతగా ఏర్పాట్లు చేసినా కూడా ఇవాంక తనకు సంబంధించిన అన్ని విషయాలను అమెరికా నుండి వచ్చే తన అధికారులు చూసుకుంటాను అంటూ చెబుతుంది. తిరిగే కారు, తినే తిండి, వేసుకునే ప్రతి ఒక్క డ్రస్‌ అన్ని కూడా అమెరికా నుండి వస్తాయని ఇప్పటికే అధికారులు తెలంగాణ ప్రభుత్వంకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాంక తీరుపై పలువురు పలు రకాలుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తనదైన శైలిలో వర్మ స్పందించాడు.

ram-gopal-varma-and-ivanka-

ఇవాంక ట్రిప్‌ గురించి ఫేస్‌బుక్‌లో వర్మ వరుసగా పోస్ట్‌లు పెట్టాడు. ఇవాంక తాను అందంగా ఉంటాను అని తనకు తాను అభిప్రాయ పడుతూ ఉంటుంది. ఆమె సదస్సుకు వచ్చిన సమయంలో కేసీఆర్‌ అందాన్ని చూసి షాక్‌ అవ్వడం ఖాయం. కేసీఆర్‌ అందం ముందు ఆమె అందం చిన్నబోతుంది. కేసీఆర్‌ పక్కన కూర్చుంటే ఆమెను ఎవరు పట్టించుకోరు అనే విషయం ఆమెకు తెలియదు. ఇక ఇవాంకకు ఏపీ ప్రభుత్వం, నంది జ్యూరీ వారు మూడు నంది అవార్డులను ఉత్తమ అందగత్తె, కుటుంబం మొత్తం చూడదగ్గ అందగత్తే, ప్రపంచ సుందరి నాయకురాలు విభాగాల్లో ఇవ్వాలని సూచించాడు. ఇవాంకకు నంది అవార్డుల వివాదంతో ముడి పెట్టాడు అంటే రామ్‌ గోపాల్‌ వర్మ ఎంతటి మేధావో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ivanka-trump