స‌మంత‌తో సినిమా చేయ‌డం లేదుః చైత‌న్య‌

Naga Chaitanya Gives Clarity about His Next movie Project
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నాగ‌చైత‌న్య చేయ‌బోయే సినిమాల‌పై ఇటీవ‌లి కాలంలో అనేక వార్త‌లొస్తున్నాయి. ప్ర‌స్తుతం ఆయ‌న సవ్యసాచి, శైల‌జారెడ్డి అల్లుడు చిత్రాల్లో న‌టిస్తున్నారు. వాటితో పాటు నాగ‌చైత‌న్య‌-బాబి కాంబినేష‌న్ లో ఓ సినిమా రాబోతోంద‌ని, ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఇంకో సినిమాలో న‌టిస్తున్నాడ‌ని, భార్య స‌మంత‌తో మ‌రో చిత్రంలో న‌టిస్తున్నాడ‌ని రెండు, మూడు రోజుల నుంచి ప‌లు వెబ్ సైట్ల‌లో క‌థ‌నాలు వ‌చ్చాయి. దీనిపై నాగ‌చైత‌న్య ట్విట్ట‌ర్ లో స్పందించారు. త‌న సినిమాల గురించి వ‌స్తున్న వార్త‌లు నిజం కాద‌ని తెలిపారు. నా సినిమాల గురించి వ‌స్తున్న వార్త‌ల్లో ఏ మాత్రం నిజం లేదు.

ప్ర‌స్తుతం స‌వ్య‌సాచి, శైల‌జారెడ్డి అల్లుడు చిత్రాల్లో న‌టిస్తున్నాను. ఈ రెండు సినిమాలు చ‌క్క‌గా తెర‌కెక్కుతున్నందుకు సంతోషంగా ఉంది. ఈ ఏడాది బాగా క‌లిసొచ్చింది. మంచి కంటెంట్ ఉన్న క‌థ‌లు వింటున్నాను. నా త‌దుప‌రి సినిమాల గురించి త్వ‌ర‌లో వెల్ల‌డిస్తా అని నాగ‌చైత‌న్య ట్వీట్ చేశారు. స‌వ్య‌సాచి చిత్రానికి చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నిధి అగ‌ర్వాల్ ఇందులో హీరోయిన్ గా చేస్తోంది. నాగ చైత‌న్య న‌టిస్తోన్న మ‌రో సినిమా శైలజారెడ్డి అల్లుడు ద‌ర్శకుడు మారుతి కాగా… అను ఇమ్మానుయేల్ క‌థ‌నాయిక‌గా ఎంపిక‌యింది.