చరణ్‌ కంటే ముందే మెగా, ఎన్టీఆర్‌ కాంబో!

Nagababu Playing NTR father role in Aravinda Sametha

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌లు కలిసి ఒక భారీ మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేయబోతున్న విషయం తెల్సిందే. మెగా నందమూరి కాంబోలో సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు దశాబ్ద కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎట్టకేలకు వీరి కాంబోలో మూవీ వస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. జక్కన్న ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్న మల్టీస్టారర్‌ చిత్రాన్ని ఈ సంవత్సరం అక్టోబర్‌లో పట్టాలెక్కించే అవకాశం ఉంది. 2020వ సంవత్సరంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ లోపులోనే మెగా మరియు నందమూరి కాంబో మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

నందమూరి హీరో ఎన్టీఆర్‌, మెగా హీరో నాగబాఋ ఒక చిత్రంలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘అరవింద సమేత’ చిత్రంలో నాగబాబు కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఎన్టీఆర్‌ మూవీలో నాగబాబు మొదటి సారి కనిపించబోతున్నాడు. ఎక్కువగా చిన్న చిత్రాలు లేదంటే మెగా మూవీల్లో మాత్రమే కనిపించే నాగబాబు త్రివిక్రమ్‌ కోరిక మేరకు ఈ చిత్రంలో నటించేందుకు ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో నాగబాబు, ఎన్టీఆర్‌లు తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నారు. వీరిద్దరి కాంబో సీన్స్‌ను చాలా చక్కగా ప్లాన్‌ చేసిన దర్శకుడు మెగా, నందమూరి కాంబో కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు వెండి తెర వింధును రెడీ చేస్తున్నాడు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే.