రాజధాని విషయం పై స్పందిచిన నటుడు నాగబాబు

రాజధాని విషయం పై స్పందిచిన నటుడు నాగబాబు

‍అమరావతి రైతులు రాజధాని విషయం లో ఆందోళనలు చేస్తూనే వున్నారు. అయితే రాజధానిని విశాఖకు తరలిస్తున్నారనే నెపంతో రాజధాని రైతులు వైసీపీ నేతల ఫై, ముక్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి ఫై జరిగిన దాడి తో వైసీపీ నేతలు అలెర్ట్ అయ్యారు. వైసీపీ నేతలు రైతుల్ని, పెయిడ్ ఆర్టిస్టులని, రియల్ ఎస్టేట్ వ్యాపారులని కామెంట్లు చేయడం తో రైతులు ఆగ్రహం తో దాడి చేసిన సంగతి తెలిసిందే.అయితే జనసేన నాయకుడు, నటుడు నాగబాబు ఈ విషయం ఫై మరొకసారి స్పందించారు. రాజధాని రైతుల మీద తప్పుడు కామెంట్లు చేసే అధికార పార్టీ ఎమ్మెల్యేలు మీ రూమ్ లలో కాకుండా, ఒక్కసారి రాజధాని ప్రాంతంలో మీటింగ్ పెట్టి ఇలాంటి కామెంట్స్ చేస్తే వాళ్ళు మీకు చేసే సన్మానం కళ్లారా చూడాలని వుంది అని నాగబాబు అన్నారు.