చైతూ కెరీర్‌లోనే అతి పెద్ద మొత్తం

nagachaitanya Sailaja Reddy alludu new record on Overseas

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ప్రస్తుతం తెలుగు హీరోలు నైజాం తర్వాత అతి ఎక్కువ దృష్టి పెడుతున్న ఏరియా ఓవర్సీస్‌. నైజాం తర్వాత ఓవర్సీస్‌లో ఎక్కువ కలెక్షన్స్‌ వస్తున్నాయి. అందుకే ఓవర్సీస్‌ ఆడియన్స్‌ను టార్గెట్‌ చేస్తూ స్టార్‌ హీరోలు సైతం సినిమాలు చేస్తున్నారు. భారీ స్థాయిలో అంచనాలున్న సినిమాలను అక్కడ రికార్డు స్థాయి స్క్రీన్‌లలో విడుదల చేస్తున్నారు. పలువురు హీరోలు అక్కడ మిలియన్‌ మార్క్‌ను క్రాస్‌ అయ్యారు. కాని దశాబ్ద కాలం క్రితం ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య ఇంకా అక్కడ ఖాతా తెరిచేందుకు కష్టపడుతున్నాడు. అయితే ఈసారి నాగచైతన్య అక్కడ మిలియన్‌ మార్క్‌ సాధించడం ఖాయంగా కనిపిస్తుంది.

నాగచైతన్య, అను ఎమాన్యూల్‌ జంటగా తెరకెక్కుతున్న ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రంకు మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. మారుతి గత చిత్రాల రికార్డు నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఓవర్సీస్‌లో దాదాపు మూడు కోట్ల రూపాయలు పెట్టి ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు నాగచైతన్య ఏ సినిమా కూడా ఇంత మొత్తంలో ఓవర్సీస్‌లో అమ్ముడు పోలేదు. కోటి లోపే ఎక్కువ సార్లు అమ్ముడు పోయింది. ఆ మొత్తంను కూడా వసూళ్లు చేయలేక పోయింది. చైతూ కెరీర్‌లో మనం తప్ప ఓవర్సీస్‌లో ఏ ఒక్క సినిమా పెద్దగా కలెక్షన్స్‌ను రాబట్టలేదు. అయినా కూడా ఈ సినిమాకు మంచి బిజినెస్‌ జరిగిందంటే ఖచ్చితంగా అది మారుతి వల్లే అని చెప్పుకోవచ్చు. ఈ చిత్రం 1.5 మిలియన్‌ డాలర్ల నుండి 2 మిలియన్‌ డాలర్ల వరకు సాధిస్తుందనే నమ్మకంను డిస్ట్రిబ్యూటర్లు వ్యక్తం చేస్తున్నారు. దసరా లోపు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మారుతి ప్లాన్‌ చేస్తున్నాడు.