క్రికెట్ లో బ‌ద్ధ‌ల‌యిన రికార్డులు… 2 పరుగులకే All Out

Nagaland team all out for 2 runs against Kerala

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

క్రికెట్ లో ఓ పేద్ద సంచ‌ల‌నం న‌మోద‌యింది. క్రికెట్ లో ఇప్ప‌టిదాకా ఉన్న అన్ని రికార్డులూ బ‌ద్ద‌ల‌య్యాయి. ఇది జ‌రిగింది దేశ‌వాళీ మ్యాచ్ లో. ఓ చిన్న మ్యాచ్ లో అన్ని రికార్డులు ఎలా బ‌ద్ద‌ల‌య్యాయ‌నుకుంటున్నారా… రికార్డు స్కోరు న‌మోద‌యింది అత్య‌ధిక ప‌రుగులు, వికెట్ల ప‌రంగా కాదు… అతి తక్కువ స్కోరుతో. క్రికెట్ క్రీడాకారులు, క్రీడాకారిణిలు ఎంత ఫామ్ లో లేక‌పోయిన‌ప్ప‌టికీ… మొత్తం ప‌ద‌కొండు మంది క‌లిపి రెండంకెల స్కోరు అయినా చేస్తారు. ఒక్కొక్క‌ళ్లు ఐదారు ప‌రుగులు చేసినా… మొత్తం స్కోరు 50 దాటుతుంది. కానీ బీసీసీఐ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఓ మ్యాచ్ లో మొద‌ట బ్యాటింగ్ చేసిన జ‌ట్టులోని మ‌హిళా క్రికెట‌ర్లు మొత్తం క‌లిపి కేవ‌లం రెండండే రెండు ప‌రుగులు న‌మోదుచేశారు. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు తొలి బంతికే ఐదు పరుగులు చేసి విజ‌యాన్ని సాధించింది. అత్యంత ఆశ్చ‌ర్యం క‌లిగిస్తున్న ఈ మ్యాచ్ కు గుంటూరు న‌గ‌రం వేదిక‌యింది.

అండ‌ర్ -19 ఉమెన్స్ సూప‌ర్ లీగ్ నిర్వ‌హిస్తోంది బీసీసీఐ. ఇందులో భాగంగా గుంటూరులో నాగాలాండ్-కేర‌ళ మ‌ధ్య 50 ఓవ‌ర్ల మ్యాచ్ జ‌రిగింది. టాస్ గెలిచిన నాగాలాండ్ జ‌ట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. క్రీజులోకి వ‌చ్చిన ఓపెనర్లు 5.2 ఓవ‌ర్లలో ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేశారు. ఆ స్కోరు వద్దే తొలి వికెట్ కోల్పోయింది. త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన బ్యాట్స్ ఉమెన్ 7.4వ ఓవ‌ర్ దాకా ఉన్న‌ప్ప‌టికీ ఒక్క ప‌రుగు కూడా చేయకుండానే ఔట‌యింది. ఇక ఆ త‌ర్వాత వ‌రుస‌గా వికెట్ల ప‌త‌నం కొన‌సాగింది. ఒకరు త‌ర్వాత ఒక‌రు క్రీజులోకి వ‌చ్చి వెళ్తున్నారు త‌ప్ప ప‌రుగులేమీ చేయ‌లేదు. చివ‌రికి 17 ఓవ‌ర్ల‌లో రెండు పరుగుల‌కే నాగాలాండ్ ఆల‌వుట్ అయింది. ఆ రెండో ప‌రుగు వైడ్ రూపంలో వ‌చ్చింది. మూడు ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో కేర‌ళ బ‌రిలోకి దిగింది. నాగాలాండ్ తొలి బంతినే వైడ్ గా వేసింది. ఆ బంతిని ఎదుర్కొన్న కేర‌ళ క్రీడాకారిణి దాన్ని ఫోర్ గా మ‌లిచింది. అంతే … కేర‌ళ విజ‌యం సాధించేసింది. కేవ‌లం ఒకే ఒక్క బంతిని ఎదుర్కొని కేర‌ళ విజ‌యాన్ని అందుకుంది. క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఒక్క బంతికే విజయం సాధించిన మ్యాచ్ ఇదేనని, అతిత‌క్కువ స‌మ‌యంలో ముగిసిన మ్యాచ్ కూడా ఇదే అని క్రికెట్ వ‌ర్గాలు తెలిపాయి.

U-19 womens Cricket Match