సినిమా విడుదల తేదీపై నాగ్ క్లారిటీ

nagarjuna clarity on the cinema release date

టాలీవుడ్ యాక్టర్లు నాగార్జున, రకుల్‌ప్రీత్‌సింగ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం మన్మథుడు 2. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నాగ్ అండ్ టీం ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం సాహో ఆగస్టు 15న గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మన్మథుడు 2 విడుదల ఆలస్యం అవుతున్నట్లు కొన్ని వార్తలు ఫిలింనగర్‌లో చక్కర్లు కొట్టాయి. దీంతో ఈ వార్తలకు చెక్ పెడుతూ తన అభిమానులకు క్లారిటీ ఇచ్చాడు నాగ్. ఎలాంటి సర్‌ప్రైజ్‌లు లేకుండా మన్మథుడు 2 చిత్రం ఆగస్టు 9న థియేటర్లలో సందడి చేయనుందని ట్విట్టర్ ద్వారా అభిమానులకు నాగ్ స్పస్టం చేశాడు.