ఆఫీసర్‌ ఆలస్యంగా వస్తాడేమో!

Nagarjuna Officer Movie Will Be Released Late Due To RGV Issue

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నాగార్జున, రామ్‌ గోపాల్‌ వర్మల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆఫీసర్‌’ చిత్రం షూటింగ్‌ ఆ మద్య పూర్తి అయ్యిందని చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. మే 24న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రచారం మే 24న ఈ చిత్రాన్ని విడుదల చేయడం లేదని, సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతుందని చెప్పుకొచ్చారు. గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌ నుండి వర్మను బ్యాన్‌ చేయాలి అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలోనే వర్మ ‘ఆఫీసర్‌’ సినిమాను వాయిదా వేయడం చర్చనీయాంశం అవుతుంది. 

‘ఆఫీసర్‌’ చిత్రంలో నాగార్జున పోలీస్‌గా నటించాడు. ‘శివ’ రేంజ్‌లో సినిమా ఉంటుందని దర్శకుడు వర్మ మొదటి నుండి చెబుతూ వస్తున్నాడు. తాజాగా విడుదలైన టీజర్‌ మరియు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ సినిమా స్థాయిని పెంచేసింది. అయితే ఈ వివాదం కారణంగా వర్మ వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా సినిమాపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. త్వరలోనే సినిమా విడుదల కొత్త తేదీని ప్రకటిస్తామని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. టాలీవుడ్‌లో ప్రస్తుతం నెలకొన్న వివాదాలు అన్ని కూడా సమసి పోయిన తర్వాత ‘ఆఫీసర్‌’ను విడుదల చేసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మొత్తానికి టాలీవుడ్‌లో వర్మ సినిమాలు ఇక ఆడటం కష్టమే అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.