రాజ్‌ తరుణ్‌కు మళ్లీ మంచి ఛాన్స్‌ మిస్‌

Raj Tarun Missed Hero Chance In Vijay Devarakonda New Movie Taxiwala

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

‘ఉయ్యాల జంపాల’ చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజ్‌ తరుణ్‌ ఆ మద్య ‘నేను లోకల్‌’ చిత్రంను చేసే అవకాశం దక్కించుకుని కోల్పోయాడు. నాని హీరోగా నటించిన ఆ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో రాజ్‌ తరుణ్‌కు మంచి ఛాన్స్‌ మిస్‌ అయినట్లుగా అంతా భావించారు. ఆ తర్వాత కూడా ఒకటి రెండు చిత్రాల కథలు రాజ్‌ తరుణ్‌ వద్దకు వచ్చి ఇతర హీరోల వద్దకు వెళ్లాయని, ఆ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయని చెబుతున్నారు. తాజాగా విజయ్‌ దేవరకొండ నటించిన ‘ట్యాక్సీవాలా’ చిత్రం కూడా రాజ్‌ తరుణ్‌ మిస్‌ అయ్యాడు అంటూ సమాచారం అందుతుంది. 

రాజ్‌ తరుణ్‌ కెరీర్‌ ఆరంభంలో గీతా ఆర్ట్స్‌లో ఒక చిత్రంకు కమిట్‌ అయ్యాడు అనే విషయం తెల్సిందే. కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం నుండి గీతా ఆర్ట్స్‌ వారు రాజ్‌ తరుణ్‌ను ఆ సినిమా నుండి తొలగించారు. ఆ స్థానంలో విజయ్‌ దేవరకొండను ఎంపిక చేయడం, తాజాగా చిత్రీకరణ పూర్తి చేసి విడుదల చేయడం చేశారు. అర్జున్‌ రెడ్డి సినిమా విడుదలైన తర్వాత విజయ్‌ దేవరకొండ మాత్రమే ట్యాక్సీవాలా స్క్రిప్ట్‌కు న్యాయం చేస్తాడని నిర్మాత అల్లు అరవింద్‌ భావించాడట. దాంతో రాజ్‌ తరుణ్‌ స్థానంలో విజయ్‌ ఎంపిక అయ్యాడు. ప్రస్తుతం విడుదలకు సిద్దం అవుతున్న ట్యాక్సీవాలా చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. భారీ స్థాయిలో ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ కూడా అవుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ మరియు టీజర్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ సినిమా స్థాయిని పెంచేశాయి. సినిమా సగం సక్సెస్‌ అయినట్లే అంటూ ప్రచారం జరుగుతుంది. దాంతో రాజ్‌ తరుణ్‌కు మంచి ఛాన్స్‌ మిస్‌ అయ్యిందని ఆయన సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.