‘ట్యాక్సీవాలా’ ప్రివ్యూ…!

Vijay Devarakonda Taxiwala Movie Preview

విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ట్యాక్సీవాలా చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రేపు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. గీత గోవిందం చిత్రంతో భారీ క్రేజ్‌ను దక్కించుకున్న విజయ్‌ దేవరకొండ ఈ చిత్రంతో మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది. అన్ని వర్గాల వారి నుండి ఈ చిత్రానికి పాజిటివ్‌ బజ్‌ ఉంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే అది కూడా రెండు నెలల ముందే పైరసీ అవ్వడంతో తీవ్రంగా చిత్ర యూనిట్‌ సభ్యులు మనోవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్లు పెట్టి సినిమా తీస్తే విడుదలకు ముందే పైరసీ అయ్యిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పైరసీ అయినా కూడా సినిమా థియేటర్లలో చూస్తేనే బాగుంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రచారం చేస్తున్నారు.

taxiwala

‘నోటా’ సినిమా ఫ్లాప్‌ అయినా కూడా విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. ఈ చిత్రంతో మరోసారి విజయ్‌ దేవరకొండ యూత్‌ ఆడియన్స్‌ను అరించడం ఖాయంగా సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు నమ్మకంతో ఉన్నారు. ఈ చిత్రంలో ప్రియాంక జువాల్కర్‌ హీరోయిన్‌గా నటించింది. దర్శకుడు సినిమాటోగ్రాఫర్‌, సంగీత దర్శకుడు ఇలా అంతా కూడా కొత్తవారే అవ్వడంతో సినిమా కూడా కొత్తగా ఉంటుందేమో అంటూ విశ్లేషకులు నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రం పైరసీ దెబ్బ నుండి కోలుకుని ఆకట్టుకుంటుందా లేదంటే మరింత కుంగి పోతుందా అనేది రేపు సినిమా విడుదలైతే కాని చెప్పలేం. విజయ్‌ దేవరకొండ క్రేజ్‌తో మినిమం కలెక్షన్స్‌ అయితే కామన్‌గా వస్తాయి. ఇక హిట్‌ అయితే భారీ వసూళ్లు ఖాయం.

Vijay Devarakonda Taxiwala Movie Postponed