బాగానే ఉందే.. దేవరకొండ ఎందుకు టెన్షన్‌ పడ్డాడు…?

విజయ్‌ దేవరకొండ నటించిన ‘ట్యాక్సీవాలా’ చిత్రం విడుదలై మంచి టాక్‌ను దక్కించుకుంది. విజయ్‌ దేవరకొండ నుండి ఎలాంటి మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అయితే ప్రేక్షకులు ఆశిస్తున్నారో ఆ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఈ చిత్రంలో ఇవ్వడం జరిగింది. దాంతో ప్రేక్షకులు సినిమాకు ఫిదా అవుతున్నారు. అయితే ఈ సినిమా ఫలితంపై అనుమానం ఉన్న చిత్ర యూనిట్‌ సభ్యులు అసలు ఈ చిత్రాన్ని విడుదల చేయకుండా నేరుగా శాటిలైట్‌ అమ్మేయాలని భావించారు. కాని కొందరు మాత్రం ఏం జరిగితే అదే జరిగింది, సినిమా విడుదల చేసి ప్రేక్షకుల జడ్జ్‌మెంట్‌ తీసుకుందామని అన్నారట. దాంతో చిత్ర నిర్మాతలు విడుదలకు సిద్దం చేశారు. ఈ చిత్రం తనకు గీత గోవిందం చిత్రంతో వచ్చిన క్రేజ్‌ను తగ్గిస్తుందని విజయ్‌ దేవరకొండ భయపడ్డాడు.

taxiwala

మొదట ఈ చిత్రం ప్రమోషన్‌లో హాజరు కాను అంటూ నిర్మాతకు చెప్పాడట. కాని ఆ తర్వాత చర్చలు జరిపిన తర్వాత సినిమా ప్రమోషన్స్‌లో ఆయన పాల్గొన్నాడు. సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నా కూడా పెద్దగా అంచనాలు అయితే లేకుండానే విజయ్‌ దేవరకొండ వ్యవహరించాడు. కాని తాజాగా సినిమా విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న నేపథ్యంలో సినీ వర్గాల వారు మరియు చిత్ర యూనిట్‌ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నోటా కంటే ఈ చిత్రం చాలా బెటర్‌ అంటూ రివ్యూలు వస్తున్నాయి. దాంతో విజయ్‌ దేవరకొండ ఊపిరి పీల్చుకున్నాడు. సినిమా బాగానే ఉంది కదా ఎందుకు టెన్షన్‌ పడ్డావు అంటూ విజయ్‌ని సోషల్‌ మీడియాలో కొందరు నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు.