మరో ‘కాంచన’ను తీసుకు రాబోతున్న లారెన్స్‌

Raghava Lawrence Started In Kanchana 3 Movie

‘ముని’, ‘కాంచన’, ‘కాంచన 2’ చిత్రాలతో ప్రేక్షకులను థ్రిల్‌ చేసి భయపెట్టిన లారెన్స్‌ అదే సిరీస్‌లో మరో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ‘కాంచన 3’ అంటూ ప్రస్తుతం లారెన్స్‌ ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుపుతున్నారు. జనవరి లేదా ఫిబ్రవరికి చిత్రీకరణ పూర్తి చేసేందుకు లారెన్స్‌ చకచక షూటింగ్‌ కార్యక్రమాలు జరుపుతున్నాడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు పెద్ద ఎత్తున తీసుకు వచ్చేందుకు లారెన్స్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ చిత్రంలో కూడా లారెన్స్‌ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. గత చిత్రాలకు ఈ చిత్రానికి దగ్గర పోలికలు ఉంటాయని తమిళ సినీ వర్గాల వారు అంటున్నారు.

Raghava-Lawrence

‘కాంచన’ చిత్రం సూపర్‌ హిట్‌ అయిన నేపథ్యంలో వెంటనే కాంచన 2 చిత్రాన్ని చేశాడు. కాని ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. అయినా నిరాశ చెందకుండా హర్రర్‌ సినిమాల సీక్వెన్స్‌ను లారెన్స్‌ కొనసాగిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ‘కాంచన 3’ చిత్రంలో హీరోయిన్స్‌గా వేదిక మరియు ఓవియాలు నటిస్తున్నారు. ఓవియా బిగ్‌ బాస్‌ తో మంచి క్రేజ్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే ఓవియా ఒక సాదారణ సెబ్రెటీగా బిగ్‌బాస్‌ ఎంట్రీ ఇచ్చి స్టార్‌డంను దక్కించుకుంది. అందుకే ఈ చిత్రంలో ఆమెకు ఛాన్స్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే కాంచన ఫస్ట్‌లుక్‌ తో పాటు టీజర్‌ను విడుదల చేయబోతున్నాడు. మొదటి కాంచన తరహాలో ఈ చిత్రం చాలా భయంకరంగా ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు.

kanchana