మాజీ ముఖ్యమంత్రి బయోపిక్‌లో నాగార్జున?

Nagarjuna To Act In YSR Biopic

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
నిన్న మొన్నటి వరకు బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్‌లో కూడా బయోపిక్‌ల సందడి మొదలైంది. ఇప్పటికే నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా బాలకృష్ణ ఒక చిత్రాన్ని చేయబోతున్న విషయం తెల్సిందే. సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ఇదే సమయంలో నాగార్జున కూడా ఒక బయోపిక్‌ చిత్రాన్ని చేసేందుకు కమిట్‌ అయినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు ప్రతిష్టాత్మకంగా భావించి తెలుగు రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవిత చరిత్రతో ఒక చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.

ఒక చిన్న నేతగా రాజకీయ ప్రస్థానంను ప్రారంభించిన రాజశేఖర్‌ రెడ్డి తక్కువ సమయంలోనే సీఎం అయ్యి, జాతీయ స్థాయి పార్టీలో తాను చెప్పిందే చెల్లేలా చేసుకున్నాడు. కాంగ్రెస్‌లో రాజశేఖర్‌ రెడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి రాజశేఖర్‌ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన విషయం తెల్సిందే. ఎంతో మంది తెలుగు ప్రజలకు ఆరాధ్యదైవం అయిన వైఎస్‌ ఆర్‌ జీవిత చరిత్రతో ఒక చిత్రం చేయాలని, అందుకు నాగార్జున కూడా ఒకే చెప్పాడు అంటూ దర్శకుడు ఆఫ్‌ ది రికార్డు చెప్పుకొచ్చాడు. మొదటి నుండి కూడా నాగార్జునకు రాజశేఖర్‌ రెడ్డి అంటే అభిమానం, జగన్‌ అంటే కూడా ప్రత్యేకమైన దృష్టిని చూపించేవాడు. అందుకే ఇప్పుడు వైఎస్‌ఆర్‌ జీవిత చరిత్ర చిత్రానికి నాగార్జున ఓకే చెప్పి ఉంటాడు అనే టాక్‌ వినిపిస్తుంది.