విషమించిన నాయిని ఆరోగ్యం

విషమించిన నాయిని ఆరోగ్యం

టీఆర్ఎస్ నేత, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్యం విషమించింది. న్యుమోనియా కారణంగా ప్రస్తుతం నాయిని జూబ్లిహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సెప్టెంబర్ 28 వ తేదిన కరోనా బారిన పడిన నాయిని.. అక్కడ చికిత్స తీసుకోగా పది రోజుల తర్వాత కరోనా నెగిటివ్ వచ్చింది. అయితే ఆ తర్వాత ఆయనకి ఉపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో వైద్యులు పరీక్షలు చేశారు. ప్రస్తుతం నాయిని జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అడ్వాన్స్‌డ్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్‌పై ఉన్నారు.

అయితే ఈ పరీక్షలలో ఇన్ఫెక్షన్ అయి న్యుమోనియా సోకిందని వైద్యులు గుర్తించారు. దీనితో అయన ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయాయి. ఈ క్రమంలో అయనని మంగళవారం హుటాహుటిన అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకి వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. నాయిని భార్య అహల్యకు కూడా కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే అక్కడ ఆమె కరోనా నుంచి కోలుకున్నప్పటికీ మేరుగైన చికిత్స కోసం అక్కడే ఉన్నారు.

ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు కరోనా సోకింది. మంత్రులు హరీష్ రావు,మహమూద్ అలీ, పలువురు ఎమ్మెల్యేలు కరోన బారిన పడ కోలుకున్న విషయం తెలిసిందే. నాయిని ఆరోగ్యంపై టీఆర్ఎస్‌లో తీవ్ర ఆందోళన నెలకొంది. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. అలాగే నాయిని అల్లుడు, ఆయన పెద్ద కుమారుడు కూడా కరోనా బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.