నాని ‘అ!’ విడుదలపై క్లారిటీ

nani awe movie release date fixed
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నాని హీరోగా వరుసగా సక్సెస్‌లు దక్కించుకుంటూ మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ హీరోగా దూసుకు పోతున్నాడు. టాలీవుడ్‌లో హీరోలు నిర్మాతలుగా మారడం పరిపాటి అయ్యింది. తెలుగులో పలువురు హీరోల దారిలోనే నాని కూడా తన అదృష్టంను పరీక్షించుకునేందుకు ఒక చిత్రాన్ని నిర్మించాడు. ప్రశాంత్‌ వర్మ అనే యువ దర్శకుడి దర్శకత్వంలో ‘అ!’ అనే చిత్రాన్ని నాని నిర్మించాడు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాు చాలా రోజుల క్రితమే పూర్తి అయ్యాయి. సినిమా కూడా విడుదల కావాల్సి ఉంది. కాని ఇతర సినిమాలు వరుసగా క్యూ కట్టిన నేపథ్యంలో వాయిదా వేయడం జరిగింది.

తాజాగా నాని ‘అ!’ చిత్రాన్ని ఫిబ్రవరి 16న విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అవసరాల శ్రీనివాస్‌ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రంలో హీరోయిన్స్‌ కాజల్‌, నిత్యామీనన్‌, రెజీనా, ఇషా ఇంకా పలువురు నటీనటులు నటించారు. విభిన్నమైన పబ్లిసిటీతో అందరి దృష్టిని ఆకర్షించిన నాని ఈ చిత్రంతో నిర్మాతగా సక్సెస్‌ సాధించడం ఖాయం అంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక భారీ తారాగణం ఉండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరి 16న ఎలాంటి పోటీ లేని సమయంలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. మరి నాని నిర్మాతగా సక్సెస్‌ను దక్కించుకుని, నిర్మాతగా కొనసాగుతాడా అనేది చూడాలి.