నాగ్‌ కంటే నానికే ఎక్కువ…

Nani gets More Remuneration than Nagarjuna for Multistarrer movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కొన్ని సంవత్సరాల క్రితం వరకు టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలు ఎవరు అనగానే ఠక్కున వినిపించే పేర్లు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌. ఈ నలుగురిలో ప్రస్తుతం చిరంజీవి విషయాన్ని పక్కన పెడితే మిగిలిన ముగ్గురు మాత్రం ఒక చిన్న హీరో స్థాయిలో కూడా వసూళ్లు పొందలేక పోతున్నారు. చిన్న సినిమాల్లో నటిస్తున్న హీరోలు కూడా పెద్ద పారితోషికాలు అందుకుంటూ ఉంటే ఈ ముగ్గురు మాత్రం పెద్దగా పారితోషికాలు రాబట్టడంలో విఫలం అవుతున్నారు. తాజాగా నాగార్జున మరియు నానిలు హీరోలుగా ఒక చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. శ్రీరామ్‌ ఆధిత్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మల్టీస్టారర్‌ చిత్రం ప్రస్తుతం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలో హీరోలు ఇద్దరు తీసుకుంటున్న పారితోషికం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.

ఈ మల్టీస్టారర్‌లో నటిస్తున్నందుకు నాగార్జున 3.5 కోట్ల పారితోషికంను అందుకుంటున్నాడు. కాని నాని మాత్రం ఏకంగా 6.5 కోట్ల పారితోషికాన్ని అందుకుంటున్నట్లుగా సమాచారం అందుతుంది. నాని ప్రస్తుత క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రంకు ఆయనకు అంత పారితోషికం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. దాంతో పాటు సినిమాలో నాగార్జున పాత్ర కంటే నాని పాత్రకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందని అందుకే నాగార్జున కంటే నాని ఎక్కువ పారితోషికం అందుకుంటున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. ఒక యువ హీరోతో స్టార్‌ హీరో కలిసి నటించడం చాలా అరుదు. అదీ కాకుండా భారీ పారితోషికం యువ హీరోకు ఇచ్చి, తక్కువ పారితోషికం నాగ్‌కు ఇచ్చినా కూడా ఆయన ఏమాత్రం బేషజాలకు పోకుండా నటిస్తున్నాడు. పారితోషికం విషయంలో మీడియాలో వస్తున్న వార్తలను చిత్ర యూనిట్‌ సభ్యులు కొట్టి పారేస్తున్నారు.