నాని చెప్పింది నిజమేనా?

nani Talks About Big Boss Telugu Season-2

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా గత సంవత్సరం ప్రసారం అయిన ‘బిగ్‌బాస్‌’ ఎంతటి సక్సెస్‌ను దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండవ సీజన్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్టార్‌ మాటీవీ వారు బిగ్‌బాస్‌ రెండవ సీజన్‌కు కూడా ఎన్టీఆర్‌ను ఎంపిక చేయాలని భావించారు. అయితే ఎన్టీఆర్‌ వరుసగా రెండు పెద్ద చిత్రాలకు కమిట్‌ అయిన కారణంగా బిగ్‌బాస్‌ చేయలేను అంటూ చేతులు ఎత్తేశాడు. దాంతో చేసేది లేక ఎన్టీఆర్‌ స్థానంలో నానిని ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నారు అంటూ వార్తలు వచ్చాయి. నాని కూడా బిగ్‌బాస్‌ సీజన్‌ 2కు ఓకే చెప్పాడు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తాజాగా నాని చెప్పుకొచ్చాడు.

నాని ద్విపాత్రాభినయం చేసిన ‘కృష్ణార్జునయుద్దం’ రేపు విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా నాని మీడియాతో మాట్లాడుతూ తాను బిగ్‌బాస్‌ చేయబోతున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు స్టార్‌ మా వారు తనను సంప్రదించలేదు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే నాని నిజం చెప్పడం లేదని, ఇప్పటికే పలు సార్లు స్టార్‌ మా ప్రతినిధులు నానితో చర్చలు జరిపారని, త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో నాని ఇలా చెప్పడం అందరికి షాక్‌ ఇచ్చింది. నాని నో చెబితే బిగ్‌బాస్‌ సీజన్‌ 2కు హోస్టింగ్‌ ఎవరు చేస్తారో అనే ఆసక్తి వ్యక్తం అవుతుంది. నాని హీరోగా వరుసగా చిత్రాలు చేస్తూనే బిగ్‌బాస్‌ హోస్ట్‌గా కూడా చేసే అవకాశం ఉంది.