తల్లినయితే హీరోయిన్‌ను కాను!

Samantha says about her children's and movies

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత ఇటీవలే అక్కినేని వారి ఇంటి కోడలు అయిన విషయం తెల్సిందే. నాగచైతన్యతో పెళ్లి తర్వాత కూడా వరుసగా సమంత చిత్రాలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇటీవలే ‘రంగస్థలం’ చిత్రంతో సమంత ఆకట్టుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో రామలక్ష్మి పాత్రలో సమంత ఆకట్టుకుంది. పల్లెటూరు అమ్మాయిగా సమంత నటించి మెప్పించింది. ఆ సినిమా సక్సెస్‌ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన సమంత తన భవిష్యత్తు గురించి చిన్న క్లారిటీ ఇచ్చింది.

గత సంవత్సరం వివాహం చేసుకున్న సమంత ఇప్పట్లో పిల్లలు వద్దనుకుంటున్నట్లుగా ఆమె మాట ద్వారా తెలుస్తోంది. మూడు నాలుగు సంవత్సరాల పాటు హీరోయిన్‌గా కెరీర్‌ కొనసాగింది, ఆ తర్వాత పిల్లలను కనాలని ఆమె భావిస్తుంది. పిల్లలు అయిన తర్వాత జీవితాన్ని పూర్తిగా వారికే అంకితం చేయాలనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. పిల్లలు అయిన తర్వాత హీరోయిన్‌గా చేయను అని, పిల్లలు పెద్ద వారు అయిన తర్వాత మళ్లీ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. సమంత గతంలోనే పెళ్లి, పిల్లలు అయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే భర్త చైతన్య మద్దతుతో సినిమాలు కంటిన్యూ చేస్తున్న సమంత పిల్లలు అయిన తర్వాత మాత్రం సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నట్లుగా పేర్కొంది.