శ్రీరెడ్డిని టాలీవుడ్ క‌న‌క‌దుర్గ అంటున్న నెటిజ‌న్లు

netizens shocking comments on sri reddy

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ కు వ్య‌తిరేకంగా శ్రీరెడ్డి చేస్తున్న పోరాటం అనూహ్య మ‌లుపు తిరిగింది. ఇప్ప‌టిదాకా జూనియ‌ర్ ఆర్టిస్టులను స‌ర‌ఫ‌రా చేసే ఏజెంట్లు, హీరోయిన్ల మేనేజ‌ర్లు, గాయ‌కుల పేర్లను బ‌య‌ట‌పెట్టిన ఆమె తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మకు చెందిన పెద్ద త‌ల‌కాయ‌ల పేర్ల‌ను బయ‌ట‌పెట్ట‌డం..పెను సంచ‌ల‌నంగా మారింది. ప్ర‌ముఖ నిర్మాత ద‌గ్గుబాటి సురేష్ కొడుకు, ద‌గ్గుబాటి రానా త‌మ్ముడు ద‌గ్గుబాటి అభిరామ్ పేరును, ఆయ‌న త‌న‌తో స‌న్నిహితంగా ఉన్న ఫొటోల‌ను బ‌య‌ట‌పెట్టి ప్ర‌కంప‌న‌లు సృష్టించిన శ్రీరెడ్డి.. ఎవ్వ‌రూ ఊహించ‌ని రీతిలో టాలీవుడ్ బ‌డా ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు గురించి ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ చేసింది. టాలీవుడ్ నుంచి దిల్ రాజు పోతే శ‌ని వ‌దిలిపోతుంద‌ని వ్యాఖ్యానించింది. ఆయ‌న కుల‌రాజ‌కీయాలు చేస్తున్నాడ‌ని మండిప‌డింది.

ఆయ‌న చేతుల్లో ఎంతోమంది న‌లిగిపోతున్నార‌ని..ఆవేద‌న వ్య‌క్తంచేసింది. కుళ్లు రాజ‌కీయాలు వ‌ద్ద‌న్నా..ఆడ‌పిల్ల‌ల‌న్నా…బ‌త‌క‌నిద్దామ‌న్నా పాపం. దిల్ రాజు(రెడ్డి)గారూ..ప్లీజ్ సంకెళ్లు వేసిన క‌ళామ‌త‌ల్లిని బంధ విముక్తురాలిని చేయండి..మీరు పోతే శ‌ని వ‌దిలిపోయింది అనుకుంటారు. బ‌తికుండ‌గానే ద‌య‌చేసి మారండి. వ‌ట్టిచేతుల‌తో పోతాం. మంచిపేరుతో పోదామ‌న్నా మ‌న‌మంద‌రం. త్యాగం అన్నా..టాలెంట్ ను చంపొద్దు అన్నా..మీరంతా మంచివారు. ద‌య‌చేసి నా విజ్ఞ‌ప్తిని ప‌రిశీలించండి అని వ్యాఖ్యానించింది. తాము అమ్మాయ‌ల‌మ‌ని, అంగ‌ట్లో స‌రుకులం కాద‌ని మ‌రో పోస్ట్ చేసింది. ద‌గ్గుబాటి అభిరామ్, దిల్ రాజు పేర్లు బ‌య‌ట‌పెట్టిన త‌ర్వాత శ్రీరెడ్డికి మ‌హిళా సంఘాలు, సామాజిక వేత్త‌ల నుంచి అనూహ్య మైన మ‌ద్ద‌తు ల‌భించింది. ఆమె పోరాటానికి అండ‌గా నిలుస్తామ‌ని, ఐద్వా త‌దిత‌ర మ‌హిళా సంఘాలు స్ప‌ష్టంచేశాయి. ఇంత‌కాలం ఆమె చేసిన పోరాటం ఓ ఎత్త‌యితే…ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చిన పేర్లు, క‌నిపిస్తున్న సాక్ష్యాలు మ‌రో ఎత్త‌ని వారు అంటున్నారు. పోలీసులు సుమోటాగా కేసు న‌మోదుచేసి తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ ప్ర‌క్షాళ‌న‌కు క‌ద‌లాల‌ని డిమాండ్ చేస్తున్నారు. నెటిజన్లు సైతం శ్రీరెడ్డి కి మ‌ద్ద‌తుగా నిలిచారు. ఇంత‌కాలానికి శ్రీరెడ్డి పోరాటం మ‌రో మ‌లుపు తిరిగింద‌ని, ఆమె తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు క‌న‌క‌దుర్గ‌గా మారింద‌ని కామెంట్లు వ‌స్తున్నాయి.