రియ‌ల్ ఎస్టేట్ డెవ‌ల‌ప‌ర్స్ పై లోకేశ్ ప్ర‌శంస‌లు

Nara Lokesh speech in CREDAI property show
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
  • గ్లోబ‌ల్ ట్రెండ్స్ కు త‌గ్గ‌ట్టుగా నిర్మాణాలు

  • రియ‌ల్ ఎస్టేట్ డెవ‌ల‌ప‌ర్స్ పై లోకేశ్ ప్ర‌శంస‌లు

ఒక ఇల్లు క‌ట్ట‌డ‌మే చాలా క‌ష్టమైన‌ప‌నిగా భావిస్తామ‌ని, అలాంటిది రియ‌ల్ ఎస్టేట్ డెవ‌ల‌ప‌ర్స్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రూ. ప‌దివేల కోట్ల పెట్టుబ‌డితో 3కోట్ల చ‌ద‌ర‌పు అడుగుల నిర్మాణాలు చేప‌డుతున్నార‌ని… రాష్ట్ర‌మంత్రి నారాలోకేశ్ ప్ర‌శంసించారు. విజ‌య‌వాడ ఏ క‌న్వెన్ష‌న్ లో ఐద‌వ క్రెడాయ్ ప్రాప‌ర్టీ షోను లోకేష్ ప్రారంభించారు. రియల్ ఎస్టేట్ డెవ‌ల‌ప‌ర్స్ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లపై త‌న‌కు పూర్తి అవ‌గాహ‌న ఉంద‌ని చెప్పారు. స‌మ‌స్య‌ల‌ ప‌రిష్కారం కోసం క్రెడాయ్ త‌ర‌పున వ‌ర్కింగ్ గ్రూప్ ఏర్పాటుచేయాల‌న్నారు. స‌మ‌స్య‌లు త‌మ దృష్టికి వ‌చ్చిన వెంట‌నే ప‌రిష్కారం అయ్యేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. రియ‌ల్ ఎస్టేట్ డెవ‌ల‌ప‌ర్స్ గ్లోబ‌ల్ ట్రెండ్స్ కు త‌గ్గ‌ట్టుగా నిర్మాణాలు చేప‌డుతున్నార‌ని లోకేశ్ కొనియాడారు.
అనంత‌పురంలో కియా కార్ల కంపెనీ నెల‌కొల్పుతున్న చోట కొరియ‌న్ భాష‌లో హోర్డింగ్స్ ఏర్పాటు చేయ‌డం చూసి తాను ఆశ్చ‌ర్య‌పోయానన్నారు. రాష్ట్రానికి రావ‌డానికి ఐటీ కంపెనీలు సిద్దంగా ఉన్నా… ఆఫీస్ స్పేస్ లేద‌ని, నివాస గృహాల‌తో పాటు ఆఫీస్ స్పేస్ కూడా క‌ట్టాల‌ని, అందుకే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా డిటిపి పాల‌సీ తీసుకొచ్చి రియ‌ల్ ఎస్టేట్ డెవ‌ల‌ప‌ర్స్ కు రెంట‌ల్ గ్యారంటీ ఇస్తున్నామ‌ని తెలిపారు. 2014లో రాష్ట్రం విడిపోయిన‌ప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎద‌ర్కొన్నామ‌ని, మ‌న ద‌గ్గ‌ర నిధులు లేవ‌ని, స‌మ‌యం లేద‌ని, మూడున్న‌రేళ్లుగా ఒక్కో స‌మ‌స్య‌ను పరిష్క‌రిస్తూ ప్ర‌జారాజ‌ధాని ఏర్పాటు చేసుకోబోతున్నామ‌ని చెప్పారు. అన్ని జిల్లాలు స‌మానంగా అభివృద్ధి చెందేందుకు ముఖ్య‌మంత్రి కార్యాచ‌ర‌ణ రూపొందిస్తున్నార‌ని తెలిపారు.