జీవీఎల్ నువ్వెవరు అసలు ? జీవీఎల్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన లోకేష్

nara lokesh twitter attack on BJP Mp GVL

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అన్నీ ఇచ్చేసాం, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే లెక్కలు చెప్పట్లేదు, సీమాంధ్రకి నిధులు ఇస్తామన్నాం కానీ స్కామాంధ్రకి కాదు,అలాగే మీకు ఇంకా లక్షలు లక్షలు కోట్లు ఇస్తాం కాని యూసీలు చూపించాలి అని అలాగే, దొలేరా సిటీ గురించి చంద్రబాబు చేస్తున్న విమర్శలని ఎంపీ అయ్యేవరకు తెలుగు ప్రజలకి తెలియని జీవీఎల్ మసి పూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో నిన్ననే మోడీకి ట్విట్టర్ ఎటాక్ ఇచ్చిన లోకేష్ జీవీల్ మీద కూడా ట్విట్టర్ ఎటాక్ ఇచ్చారు. యూసీలు సరిగా లేవని చెప్పటానికి జీవీఎల్‌ ఎవరని నారా లోకేశ్‌ ప్రశ్నించారు. యూసీలు సరిగా లేకపోతే కేంద్రంలోని ఆ శాఖలు వివరణ అడుగుతాయని వాటి పని కూడా మీరే చేస్తున్నారా అని ప్రశ్నించారు. వెనుకబడిన జిల్లాలకు కేటాయించిన నిధులపై యూసీలు సమర్పించామన్నారు. యూసీలకు కేంద్ర శాఖలు ఆమోదించడం కూడా జరిగిందని తెలుసుకోవాలని సూచించారు.

ఇప్పటి వరక కేంద్రం అమరావతికి ఇచ్చింది రూ.1500 కోట్లు మాత్రమేనని, యూసీలు రూ.1,583 కోట్లకు సమర్పిస్తే ఆమోదించారని పేర్కొన్నారు. జీవీఎల్‌ చెబుతున్న ఊహాజనిత ప్రాజెక్టుకు రూ.8,962 కోట్లు విడుదల చేశామని చెబుతున్నారని, అది ఏ ప్రాజెక్టు, దాని వివరాలు తెలపాలని, లేదంటే అబద్దమని ఒప్పుకోవాలన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చేందుకు యూసీలు అవసరం లేదుకదా? అని బదులిచ్చారు. అమరావతిలో డ్రైనేజీ పనులకు ఏ విధమైన నిధులు విడుదల చేయలేదు. రూ. 460 కోట్లు మరియు రూ. 540 కోట్లు విజయవాడ మరియు గుంటూరు నగరాలకు మాత్రమే విడుదల చేసారు. ఇప్పటి వరుకు అయిన పనులకు గాను, రూ. 349 కోట్ల యూసిలు సమర్పించటం జరిగింది. రెండు నగరాల్లో మిగిలిన పనులు, వచ్చే సంవత్సరం నాటికి పూర్తి అవుతుంది.

కాగ్ రిపోర్ట్ 2016 – 17 ప్రకారం, కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన రూ. 83900 కోట్ల ఎడ్యుకేషన్ సెస్ లెక్కలలో అవకతవకలు జరిగినట్టు ప్రశ్నించింది. జ్యూట్ కార్పొరేషన్ నిధుల మళ్లింపు, వివిధ శాఖల యూసిలు సమర్పించకపోవటం వీటిలో ముఖ్యమైనవి. ఇప్పుడు బీజేపీ వారు, కాగ్ కేంద్ర ప్రభుత్వం పై లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. యూసిలు సమర్పించడం, వాటిని ఆమోదించడం అనేది పరిపాలనలో జరిగే రొటీన్ ప్రాసెస్. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పరిధిలోనిది. ఈ విషయం పట్టుకుని, బీజేపీ వారు నిధులు దుర్వినియోగం జరగుతుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు పై రాజకీయం చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రనికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాము అని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి యూసిలు అవసరం లేదనే విషయం జివిఎల్ నరసింహ రావు గుర్తుంచు కోవాలి అని లోకేష్ ట్వీట్ చేశారు.

జీవీఎల్ నే కాక నిన్న డైరెక్టుగా ప్రధాని మోడీపైనే దూకుడు చూపిస్తూ లోకేష్ ట్వీట్ల వర్షం కురిపించారు. ‘హక్కుల కోసం పోరాడుతున్న ఏపీని.. మీ మాటలు చల్లబరుస్తాయనుకుంటున్నారా?’ అంటూ మంత్రి లోకేశ్‌ ప్రధాని మోదీకి నిన్న ట్వీట్‌ చేశారు. అయితే లోకేష్ ఇలా చెలరేగి విమర్శలు చేయడం వెనుకున్న కారణాలు ఏమిటా అని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో పలు ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి. అదేమిటంటే గత కొద్దిరోజులుగా లోకేష్ అవినీతి పరుడు అని కేంద్రం అతని మీద చర్యలు తీసుకోబోతుందని వైకాపా-బీజీపీ-పవన్ పార్టీలకి చెందిన కొందరు ప్రచారం కూడా మొదలెట్టారు. అయితే ఈ ప్రచారం సాగుతున్న తరుణంలో లోకేష్ చేస్తున్న ఈ ట్వీట్ విమర్సల బాణాలు చూస్తుంటే వారు ఆరోపిస్తున్నట్టు లోకేష్ తన మీద ఎటువంటి అవినీతి మరక లేదు కాబట్టే ఇలా చెలరేగిపోతుండచ్చు అని వారు భావిస్తున్నారు. లేని పక్షంలో ఒకవేళ అవినీతి చేసినా ఇప్పుడు రాష్ట్రానికి జరుగుతున్న నష్టం ముందు ఏదీ ఎక్కువ కాదు అని అయినా రంగంలోకి దిగాడేమో అని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో పర్యటనలు చేస్తున్న యువనాయకులు పవన్, జగన్ లు మోడీ ని పల్లెత్తు మాట కూడా అనకుండా తమ భక్తిని ప్రదర్శిస్తుంటే లోకేష్ మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినయినా విమర్శించేందుకు వెనుకాడకంలేదు అని వారు పేర్కొంటున్నారు.