నాసా కాంటెస్ట్‌లో విశ్వవిజేతగా నారాయణ స్కూల్స్ !

నాసా స్పేస్‌ సెటిల్‌మెంట్‌ కాంటెస్ట్ లో నారాయణ విద్యార్థులు మరో మారు సత్తా చాటారు. గత ఐదేళ్లుగా వరుసగా ప్రపంచ వ్యాప్తంగా టాప్ ర్యాంక్స్ సాదిస్తున్న నారాయణ విద్యార్దులు ఈ ఏడాది కూడా వరల్డ్ 1,2,3 ర్యాంకులు సాదించారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 112 సెలక్షన్స్‌ ప్రకటించగా ఒక్క నారాయణ స్కూల్స్‌ నుంచే 38 సెలక్షన్స్‌ సాధించి విజయకేతనం ఎగురవేశారని తెలిపారు. వరల్డ్‌ నెంబర్‌ 1 స్థానంలో 5, వరల్డ్‌ నెంబర్‌ 2 స్థానంలో 7, వరల్డ్‌ నెంబర్‌ 3 స్థానంలో 5 సెలక్షన్స్‌ నారాయణ విద్యార్థులు దక్కించుకున్నారన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చేసిన ప్రెస్ మీట్ లో ఎండీ సింధూర మాట్లాడుతూ ఈ ఘన విజయంతో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నారాయణ విద్యార్థుల విజయప్రస్థానం కొనసాగుతోందని పేర్కొన్నారు. నారాయణ తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ద, వారి స్పెషల్ గా డిజైన్ చేయబడిన కరికులమే ఈ విజయాలకి కారణమని ఆమె పేర్కొన్నారు. అలాగే గత ఏడాది జరిగిన అన్ని ఒలంపియాడ్స్ లో నారయణ విద్యార్ధులు విజయ కేతనం ఎగురవేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. నిజానికి నారాయణ విద్యార్ధులకి మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో పాటు ఆస్ట్రానామీ, కంప్యూటర్ సైన్స్ లాంటి వాటిలో ప్రత్యేక శ్రద్ధతో శిక్షణ ఇస్తున్నట్టు పేర్కొన్నారు.