ఎన్నికల నోటిఫికేషన్ విడుదల…వారం రోజులే !

election commission on selfie voters at polling

సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు కేంద్రం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అనంతరం ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. మార్చి 21న హోలీ, 24న ఆదివారం సెలవు దినాలు కావడంతో ఆ రెండురోజులూ నామినేషన్ల స్వీకరించోమని అధికారులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో 42 లోక్‌సభ స్థానాలతోపాటు ఏపీ శాసనసభకు ఏప్రిల్‌ 11న పోలింగ్‌ జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. నామినేషన్ల స్వీకరణకు గడువు ఈ నెల 25తో ముగియనుంది. మార్చి 26న నామినేషన్లను పరిశీలిస్తారు. మార్చి 27 నుంచి 28 వరకు ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. ఏప్రిల్‌ 11న పోలింగ్‌ జరగనుండగా.. మే 23న ఫలితాలు వెల్లడవుతాయి. తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు రెవెన్యూ, పోలీసు యంత్రాంగం కలిపి సుమారు 2.50 లక్షల మందిని వినియోగిస్తున్నారు. తెలంగాణలో జనవరి 1న ప్రకటించిన జాబితా ప్రకారం 2.95 కోట్లమంది ఓటర్లు ఉన్నారు. తాజాగా ఓటు నమోదు కోసం ఎన్నికల సంఘం ఇచ్చిన గడువు మార్చి 15తో ముగిసింది. ఓటర్ల తుది జాబితాను మార్చి 25న ప్రకటించనున్నారు. తుది జాబితా ప్రకటన నాటికి ఓటర్ల సంఖ్య కాస్త అటూఇటూగా 2.98 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.