దేవెగౌడకి ఫోన్ చేసిన మోడీ

narendra modi tweet on phone call to deve gowda

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 

కర్నాటక రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్న నేపధ్యంలో ప్రధాని మంత్రి మోడీ మాజీ ప్రధాని దేవేగౌడకి ఫోన్ చేశారు. ఈరోజు తన పుట్టిన రోజు సందర్భంగా మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్ గౌరవాధ్యక్షుడు దేవెగౌడ శుక్రవారం ఉదయం తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ఉన్న సమయంలోనే దేవెగౌడకు ప్రధాని మోడీ ఫోన్‌ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారని తెలుస్తోంది. ప్రధాని మోడీ ఫోన్‌ చేసిన విషయాన్ని దేవెగౌడ తనయుడు రేవణ్ణ ధృవీకరించారు. కొద్ది సేపటికి నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు నేను మాజీ ప్రధాని దేవెగౌడతో మాట్లాడాను. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాను. ఆయన సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షును కలిగుండాలని ప్రార్థిస్తున్నా’ అంటూ మోడీ ట్వీట్ చేశారు.