నాటకం టీజర్ : ‘తప్పు’ తప్పే కాదు

natakam official Teaser
యాద్రుచ్చికమో, కాకతాళీయమో కానీ ఈ మధ్య టాలీవుడ్ లో బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గత ఏడాది అర్జున్ రెడ్డి, ఈ ఏడాది RX 100 అలాగే వచ్చి సక్సెస్ చంకన పెట్టుకు వెళ్ళాయి. ఇలా బోల్డ్ కంటెంట్ ఉన్న అన్ని సినిమాలు సక్సెస్ అవుతాయని చెప్పలేం కానీ మెప్పించే కంటెంట్ ఉంటే మాత్రం ఆదరణకు లోటు ఉండదని ఇటీవలే వచ్చిన ఆరెక్స్ 100 ఋజువు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే కోవలో తెరకెక్కిన మరో మూవీ నాటకం.

natakam

ఆశిష్ గాంధీ హీరోగా ఆషిమా నెర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దర్శకుడు కళ్యాణ్ జి గోగన. పక్కా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ మూవీ పల్లెటూరి లవ్ స్టోరీ. పార్వతి అనే అమ్మాయికి బాల కోటేశ్వర్ రావు అనే అబ్బాయికి మధ్య జరిగిన విలేజ్ స్టైల్ రోమాన్స్ కు వర్మ స్టైల్ హింస కూడా దట్టించినట్టు కనిపిస్తోంది. సరదా పెడుతూ భయాన్ని కలిగిస్తున్న ఈ సినిమా ట్రైలర్ మీరు కూడా చుసేయ్యండి మరి.