బాబూ అంత అవసరం ఏమొచ్చింది : ఉండవల్లి…!

Undavalli Arun Kumar Comments On AP CM Chandrababu
ఈరోజు ఏపీ ప్రభుత్వం మీదా, ఏపీ ముఖ్యమంత్ర్రి మీదా మాజీ ఎప్మీ ఉండవల్లి అరుణ కుమార్ తీవ్ర స్తాయిలో విరుచుకుపడ్డారు. రాజమండ్రిలో మీడియా ముఖంగా మాట్లాడిన ఆయన అమరావతి బాండ్లు వడ్డీరేట్లపై రాష్ట్రంలో చర్చ జరుగుతోందని అసలు ట్యాక్స్‌ ఎంతో తెలియకుండా బాండ్లు ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు. బాండ్లలో బ్రోకర్‌కు రూ. 17 కోట్లు ఇవ్వడమే చంద్రబాబు చెబుతున్న పారదర్శకతా ? అని ప్రశ్నించారు. ఈ బాండ్ల ద్వారా తీసుకున్న రూ.2వేల కోట్ల అప్పుకు ప్రతి మూడు నెలలకు 10.36శాతం అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తోందన్నారు. ఏపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ బాండ్లను కొనుగోలు చేసిన 9మంది పేర్లను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ap-cm-undavalli
అమరావతి అభివృద్ధి పేరుతో ఎక్కువ వడ్డీకి అప్పు తీసుకోవాల్సిన అవసరం ఏముందన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.  ఏపీ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో రూ.1.30లక్షలకోట్లు అప్పు చేసిందని.. ఇంత అప్పు చేసి ఎందుకు ఖర్చు చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు ఉండవల్లి. ప్రభుత్వం వారానికోసారి ఖర్చు పెట్టిన లెక్కలు చెప్పగలరా అని ప్రశ్నించిన ఆయన కనీసం ఈ 9 నెలల ఖర్చైనా చంద్రబాబు ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రూ.8.50కి తయారయ్యే మద్యంను రూ.50కి అమ్ముతున్నారని.. ఇందులో రూ.37 ప్రభుత్వం దోచేస్తుందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మద్యం సీసాలు పట్టుకొచ్చారు.
undavalli