National Politics: ఎన్నికల బాండ్ల పూర్తి డేటా ఎందుకు ఇవ్వలేదు..? SBI ను ఆగ్రహించిన సుప్రీం

National Politics: Why is the complete data of election bonds not given? Supreme angered SBI
National Politics: Why is the complete data of election bonds not given? Supreme angered SBI

ఎలక్టోరల్‌ బాండ్ల కేసులో ఎస్‌బీఐపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో మరోసారి ఎస్బీఐకి నోటీసులు జారీ చేసింది. SBI సమర్పించిన వివరాలు అసంపూర్తిగా ఉండటంపై అసహనం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం బాండ్ల నంబర్లు లేకపోవడం వల్ల ఎవరు ఎవరికి ఇచ్చారో స్పష్టత లేదని పేర్కొంది. ఈనె 18వ తేదీలోగా అన్ని వివరాలు ఈసీకి సమర్పించాలని నిర్దేశించింది.

ఈనెల 11వ తేదీన ఎలక్టోరల్ బాండ్ల కేసులో జారీ చేసిన ఆర్డర్‌లోని ఆపరేటివ్ పోర్షన్‌ను సవరించాలని కోరుతూ ఈసీ పిటిషన్‌ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సారథ్యంలోని ధర్మాసనం ఈ వ్యాజ్యంపై ఇవాళ విచారణ జరిపింది. ఎలక్టోరల్‌ బాండ్లకు సంబంధించి అన్ని వివరాలు వెల్లడించాలని గతంలో ఇచ్చిన తీర్పులో పేర్కొన్నా…అందుకు విరుద్ధంగా వ్యవహరించిన ఎస్బీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీల్డ్ కవర్‌లో ఈసీకి గతంలో సమర్పించిన వివరాలను స్కాన్ చేసి డిజిటలైజ్ చేయాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. ఆ వివరాలన్నీ కూడా రేపు సాయంత్రం 5గంటల కల్లా వెబ్‌సైట్‌లో ఉంచాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సూచించింది.