నయనతార ను భయపెడుతున్న రజినీకాంత్

నయనతార ను భయపెడుతున్న రజినీకాంత్

సూపర్ స్టార్ రజినీకాంత్ కు తమిళనాడులో లక్షకు పైగా అభిమాన సంఘాలు ఉన్నాయి అంటే అతడి క్రేజ్ ఏరేంజ్ లో ఉందో అర్ధం అవుతుంది. అయితే రజినీకాంత్ సినిమాలకు ఈమధ్య కాలంలో ఊహించిన స్థాయిలో రికార్డులు క్రియేట్ చేయలేకపోతున్నాడు. దీనితో రజినీకాంత్ కెరియర్ ప్రశ్నార్ధకంగా మారింది.

ఇలాంటి పరిస్థితులలో రజినీకాంత్ తన మ్యానియాను మళ్ళీ నిలబెట్టుకోవడానికి మురగదాస్ దర్శకత్వంలో చేస్తున్న ‘దర్బార్’ మూవీ పై ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీ ఈ సంక్రాంతి రేస్ కు రాబోతోంది. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ ను చాల ముందుగా డిసెంబర్ నుంచి మొదలు పెడుతున్నారు.

డిసెంబర్ 7న ఈ మూవీ ఆడియో ఫంక్షన్ చెన్నైలో అత్యంత ఘనంగా నిర్వహించి ఆ తరువాత హైదరాబాద్ లో కూడ ఈ మూవీ ఈవెంట్ ను నిర్వహించాలని రజినీకాంత్ ఆలోచనలు చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో రజినీకాంత్ నయనతారను ఈ సినిమా ఈవెంట్స్ కు రమ్మని వ్యక్తిగతంగా కోరడంతో నయన్ ఎటూ తేల్చుకోలేక పోతోంది అని అంటున్నారు. ‘చంద్రముఖి’ మూవీలో తనకు అవకాశం ఇప్పించిన నాటి నుండి రజినీకాంత్ అంటే నయనతారకు ప్రత్యేకమైన గౌరవం.

నయన్ తన సినిమాల విషయంలో అనుసరించే పద్ధతులను ఫాలో అవుతూ ‘దర్బార్’ డుమ్మా కొడితే తమిళనాడులో అభిమానుల మాటల దాడికి తట్టుకోగలనా అదే నెగిటివ్ ప్రభావం తాను పెళ్లి చేసుకోబోతున్న దర్శకుడు విఘ్నేశ్ శివన్ పై ఎలా ఉంటుంది అన్న కన్ఫ్యూజన్ లో నయన్ ఉన్నట్లు టాక్. దీనికితోడు ఈ మధ్యనే విడుదలైన ‘సైరా’ ఈవెంట్ కు డుమ్మా కొట్టి ఇప్పుడు ‘దర్బార్’ ఈవెంట్ లో హైదరాబాద్ లో కనిపిస్తే మెగా అభిమానుల పోరు కూడ తప్పదు.