లాటరీ పద్ధతిలో హెచ్‌-1బీ వీసాలు జారీ

లాటరీ పద్ధతిలో హెచ్‌-1బీ వీసాలు జారీ

భారత టెక్కీలకు ఊరట ఇచ్చే వార్త ప్రకటించింది యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ ఏజెన్సీ. రెండో రౌండ్‌ లాటరీ పద్ధతిలో హెచ్‌-1బీ వీసాలు జారీ చేయనున్నట్లు యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్ ప్రకటించింది. మొదటి లాటరీలో అనుకున్న స్థాయిలో అభ్యర్థులను ఎంపిక చేయలేకపోయినందున.. జులై 28న మరికొందరిని ర్యాండమ్‌ సెలక్షన్‌ ప్రాసెస్‌లో ఎంపిక చేసినట్లు తెలిపింది. ఆగష్టు 2 నుంచి ప్రారంభం కాబోయే పిటిషన్‌ ఫైలింగ్‌ ప్రక్రియ నవంబర్‌ 3తో ముగియనన్నుట్లు అర్హులైన అభ్యర్థులకు సూచించింది.

ఇదిలా ఉంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను  హెచ్‌-1బీ వీసా దరఖాస్తుల రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వాళ్లలో మొదటి లాటరీలో ఎంపిక చేసింది. మొదటి లాటరీలో అనుకున్న స్థాయిలో ఎంపికలు చేయలేకపోయామని, కాబట్టే, ఇప్పుడు రెండో లాటరీ నిర్వహిస్తున్నట్లు USCIS వెల్లడించింది. తద్వారా అదనంగా వందల మంది ఆశావాహ టెక్కీలకు అవకాశం కల్పించనున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా ఇది స్టెమ్‌-ఓపీటీ స్టూడెంట్స్‌కు భారీ ఊరట ఇవ్వనుంది.కాగా, హెచ్‌-1బీ వీసాలకు విదేశీ వృత్తి నిపుణుల నుంచి అధిక డిమాండ్‌ ఉన్న సంగతి తెలిసిందే.

ఈ వీసాల జారీ విషయంలో సంప్రదాయ లాటరీ విధానాన్నే కొనసాగించాలని జో బైడెన్‌ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం 85,000 కొత్త హెచ్ -1 బీ వీసాలను జారీ చేస్తుంటుంది. తద్వారా చైనీయులకు-భారతీయులకు ఆయా దేశాల ,ఐటీ సంస్థలకు భారీ ప్రయోజనం చేకూరునుంది. హెచ్‌-1బీ వీసాలు పొందినవారు అక్టోబర్‌ 1 నుంచి అమెరికాలో ఉద్యోగాల్లో చేరొచ్చు. ప్రతి ఏడాది వీదేశీయులకు 65 వేల హెచ్-1బీ వీసాలు జారీ చేస్తోంది. వీరు మాత్రమే హెచ్-1బీ క్యాప్ దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే మరో 20వేల హెచ్-బీ వీసాలు మాస్టర్ క్యాప్ కింద ఇస్తోంది.