మరో మలుపు తిరిగిన అయేషా మీరా కేసు !

New Twist In Ayesha Murder Case
వైఎస్ ముఖ్యమంత్రి గా ఉండగా 11 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు విచారణ మరి మలుపు తిరిగింది. మొదటి నుంచి ఊహించని మలుపులు తిరుగుతున్న ఈ కేసులో తాజాగా సిట్ మరో షాక్ ఇచ్చింది. ఈ హత్య కేసుకు సంబంధించిన రికార్డులన్నీ ధ్వంసమయ్యాయంటూ సిట్ కోర్టుకు తెలిపింది. 2007 డిసెంబర్‌లో బీ ఫార్మసీ చదవుతున్న ఆయేషా మీరాను విజయవాడలో ఆమె ఉంటున్న హాస్టల్‌లోనే దారుణంగా హత్య చేశారు. డెడ్‌బాడీని తీసుకెళ్లి బాత్‌రూమ్‌లో పడేశారు. అక్కడ ఓ లేఖ కూడా బయటపడగా అందులో తన ప్రేమను నిరాకరించినందుకు ఆమెను చంపినట్లు రాసి ఉంది. ఈ కేసు అప్పట్లో సంచలనంగా మారగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే సత్యంబాబు అనే యువకుడ్ని అరెస్ట్ చేయగా తర్వాత అతడు నిర్థోషని తేలడంతో విడుదలయ్యాడు. సత్యంబాబు విడుదల కావడంతో ఈ కేసు వ్యహారం మళ్లీ మొదటికి వచ్చింది.
Ayesha Murder Case
ఆయేషా కేసుపై శుక్రవారం హైకోర్టులో విచారణ సందర్భంగా సిట్ ఈ విషయాన్ని తెలియజేసింది.  విజయవాడ కోర్టలో ఆయేషా మీరా హత్యకేసుకు సంబంధించిన రికార్డులు ధ్వంసమైనట్లు సిట్ తెలిపింది. హైకోర్టులో కేసు విచారణ నడుస్తున్న సమయంలోనే ధ్వంసమయ్యాయని తెలిపింది. సీరియస్‌గా స్పందించిన హైకోర్టు రికార్డుల ధ్వంసంపై విచారణకు ఆదేశించింది. దీనిపై విచారణ జరిపి 4 వారాల్లో నివేదిక సమర్పించాలని రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది.